తెలంగాణ

ఉద్యోగులను బెదిరిస్తున్న జూపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఉద్యోగులను మంత్రులు బెదిరిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీ్ధర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక అధికారిపై బెదిరింపులకు దిగారని ఆరోపించారు. గతంలో ప్రజలను, అధికారులను రౌడీలు, గూండాలు బెదిరించేవారని, కానీ టీఆర్‌ఎస్ పాలనలో మంత్రులే అధికారులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. రౌడీల పాత్రను మంత్రులే పోషించడం దారుణమని అన్నారు. పద్మారావు, గువ్వల బాలరాజు, దుర్గం చిన్నయ్య వంటి వారు అనేక మంది బెదిరింపులకు పాల్పడిన ఘటనలు గతంలో చాలా ఉన్నాయని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేషీలు సెటిల్మెంట్‌లకు అడ్డాగా మారిపోతున్నాయని, ఎమ్మెల్యేలు, మంత్రులే రౌడీల్లా వ్యవహరిస్తే సామాన్యులు ఎవరి వద్దకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో 30 ఎకరాల దళితుల భూమి కబ్జాచేశారని ఆరోపణలు వస్తే నేటికీ ఆ విషయం తేలలేదన్నారు. ముఖ్యమంత్రి ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పోలీసు అధికారులను సైతం జూపల్లి బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయని, వెంటనే మంత్రిపై తగిన చర్యలను సీఎం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.