తెలంగాణ

అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 3: ఉమ్మడి రాష్ట్రంలో ఐదు దశాబ్దాలుగా జరగని అభివృద్ధిని తెలంగాణ ఏర్పాటు తర్వాత గడిచిన నాలుగేళ్లలోనే చేసి చూపించామని, దీంతో సూర్యాపేట నియోజకవర్గం ప్రగతిబాటన పయనిస్తుండగా తమకు ఉనికి ఉండదనే భయంతో ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని మిర్చియార్డులోని నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తొలిసారిగా నియోజకవర్గస్ధాయి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య పాలకులు పక్షపాత ధోరణిని అవలంబించి తెలంగాణలో అరకొరగా అభివృద్ధి చేశారన్నారు. పార్టీల వారీగా పక్షపాతం చూపి తమకు అనుకూలమైన చోట్ల మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అందుకు భిన్నంగా రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను సమాన స్థాయలో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
గత పాలకులు ఎన్నికలకు ముందు అభివృద్ధి జపం చేస్తూ హడావుడి చేసేవారని, తిరిగి గెలిచిన తర్వాత మళ్లీ అదే విధా నం కొనసాగించడంతో అన్ని పార్టీలు అంతేనన్న భావనకు ప్రజలు వచ్చారన్నారు. అయితే, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై నమ్మకంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి సంక్షేమం కోసమే వినియోగించి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వారి సంక్షేమానికి పాటుపడుతూ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలన్నింటినీ అమలు చేసి రికార్డు సాధించడంతో పాటు ఎలాంటి హమీ లు ఇవ్వకున్నా ప్రజల అవసరాలను గుర్తెరిగి వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపిన గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు. అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయో రోజుల్లో సగానికి పైగా గ్రామాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందన్నారు. ఇక నుండి తాను నియోజకవర్గ ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని, ఈనెల 15 నుండి అన్ని గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు ఇంకా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తానన్నారు. ఈనెల 27వతేదీన పార్టీ ఆవిర్భావ వేడుకలను గ్రామగ్రామాన పండుగలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

యాదాద్రి వార్షిక ఆదాయం
రూ. 93.96 కోట్లు
పఖర్చు రూ. 93 కోట్ల 31లక్షలు
పరూ. పెరిగిన ఆదాయం 43.48 లక్షలు
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 3: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానం 2017-18 వార్షిక ఆదాయ, వ్యయాలను మంగళవారం వెల్లడించారు. 93కోట్ల 96 లక్షల 91వేల 769 రూపాయల ఆదాయం లభించగా, వ్యయం 93కోట్ల 31లక్షల 2వేల 400 రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వార్షిక ఆదాయం 43 లక్షల 48వేల 235 రూపాయలు పెరగగా, వ్యయంలో 5కోట్ల 49లక్షల 42వేల 197 రూపాయల తగ్గుదల ఉండటం గమనార్హం. వార్షిక ఆదాయంలో అత్యధికంగా 17కోట్ల 91 లక్షల 66వేల 865 రూపాయలు ప్రసాద విక్రయాల ద్వారా రావడం విశేషం. దేవస్థానం హుండీ ఆదాయం 11కోట్ల 24లక్షల 67వేల 142.20 రూపాయలుగా ఉంది.
రోజువారి అద్దెల ద్వారా 2కోట్ల 28లక్షల 20వేల 33రూపాయలు, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా 3,23,64, 500, శీఘ్ర దర్శనం ద్వారా 8లక్షల 63వేల 575 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం ద్వారా కోటి 44లక్షల 64వేలు, వీఐపీ దర్శనాల ద్వారా 4కోట్ల 13లక్షల 33వేల 100 రూపాయలు, ఆర్జిత సేవల ద్వారా 4కోట్ల 84 లక్షల 75వేల 231.05రూపాయలు, కళ్యాణ కట్ట ద్వారా 2కోట్ల 74లక్షల 87వేల 463రూపాయలు, కొబ్బరికాయలు, పాదరక్షల ద్వారా కోటి 83లక్షల 19వేల 173 రూపాయలు, దేవస్థాన మడిగల ద్వారా 2కోట్ల 61లక్షల 18వేల 277రూపాయలు, ఇతరత్రా ఆదాయం 41కోట్ల 58లక్షల 12వేల 409.83రూపాయలుగా వచ్చినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. 2016-17లో ఆదాయం 93కోట్ల 53లక్షల 43వేల 534రూపాయలు, వ్యయం 98కోట్ల 80లక్షల 44వేల 597రూపాయలుగా ఉంది. 2017-18 వార్షిక ఆదాయం 93కోట్ల 96లక్షల 91వేల 769.08రూపాయలు, వ్యయం 93కోట్ల 31లక్షల 2వేల 400రూపాయలుగా ఉండటం గమనార్హం. స్వామి వారి గర్భాలయం స్వయంభు పంచ లక్ష్మీనర్సింహుడి దర్శనాలు అందుబాటులో లేకపోయినా.. బాలాలయంలోనే స్వామి వారి దర్శనం కొనసాగుతున్నా దేవస్థానం ఆదాయం ఏటా పెరుగుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో యాదాద్రి నూతన ఆలయ నిర్మాణాలన్నీ పూర్తయిన పక్షంలో భక్తుల రద్దీ, దేవస్థానం ఆదాయం మరింత భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.