తెలంగాణ

2కోట్ల సభ్యత్వం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: జనసేన పార్టీలో రెండు కోట్ల మందిని భాగుస్వామ్యులను చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నడుస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తెలిపారు. సామాజిక, రాజకీయ బాధ్యతతో కూడిన వ్యవస్థను జనసేన తెలుగు రాష్ట్రాల్లో తీసుకు వస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జనసేన ఐటి సెంటర్‌ను, గిడుగు వెంకటరామమూర్తి ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను పవన్‌కళ్యాణ్ ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. 800 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఈ కేంద్రంలో పనిచేస్తున్నారని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా వాలంటీర్లను , పార్టీ శ్రేణులను ఉద్ధేశించి పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ , జనసేన నేతలకు, జనసైనికులకు ఉపయోగపడేలా ఐటీ సెంటర్, నాలెడ్జిహబ్ ఉంటాయని అన్నారు. ఇంత వరకూ మిస్టుకాల్ ద్వారా పార్టీ సభ్యులుగా 10 లక్షలమంది ఒక్క సీజన్లోనే చేరారని అన్నారు. క్షేత్రస్థాయిలో సభ్యత్వ నమోదు కోసం 20 లక్షల సభ్యత్వ పుస్తకాలను ఇచ్చామని పార్టీ నిర్మాణం ఎంతో సహనంతో చేయాల్సిన ప్రక్రియ అని పవన్ చెప్పారు. రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదని, సమస్యల్లో కూరుకుపోయిన వారికీ, వ్యవస్థను ఇవ్వాల్సిన అండదండలకు దూరంగా ఉన్నారో వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పారు. సమాజం కోసం, పాతికేళ్లు ఈ రాజకీయాల్లో ఉండేందుకు తాను చేయాలని ప్రిపేర్ అయి వచ్చానని, ఎంతో ప్రేమాభిమానాలతో ఐటీ సెంటర్‌లో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం, పార్టీ నేతలు ఏవీ రత్నం, శంకర్ గౌడ్, రియాజ్, పార్థసారధి, ఎం కృష్ణారావు, ప్రభు, రవిప్రసాద్, అద్దేపల్లి శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.