తెలంగాణ

ఫీజుల ఖరారులో ఎందుకీ జాప్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: ఫీజుల ఖరారుపై ఎందుకు జాప్యం జరుగుతుందని రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. 2016లో ఫీజులను తగ్గించమని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కోరారు, ఇలాగే జాప్యం చేస్తే వారి పిల్లలు ఇంజనీరింగ్‌కు వచ్చేస్తారు అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ టీబీ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. హెచ్‌ఎస్‌పీఎ దాఖలు చేసిన పిటీషన్‌పై ప్రభుత్వం తరఫున హాజరైన కౌన్సిల్‌ను ప్రధాన న్యాయమూర్తి పలు ప్రశ్నలు వేశారు. ఈ కేసులో రెండు వారాల గడువులో ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. హెచ్‌ఎస్‌పీఎ తరఫున సీనియర్ న్యాయవాది పి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులో పలు స్కూళ్లు ఎలా వ్యాపారమయంగా నడుస్తున్నాయో వివరించారు. కేసు తదుపరి విచారణను జూలై 31వ తేదీకి వాయిదా వేశారు.
ఇసెట్ స్పాట్ అడ్మిషన్లు
హైదరాబాద్, జూలై 17: టీఎస్ ఇసెట్ స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. స్పాట్ అడ్మిషన్లకు కాలేజీలు 20వ తేదీన నోటిఫికేషన్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. 21న దరఖాస్తులను స్వీకరించి, 24న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించాలి. ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 26న ఆ వివరాలను అప్‌లోడ్ చేయాలి.