తెలంగాణ

లారీల సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: ఈ నెల 20 నుంచి లారీల సమ్మెకు యజమానులు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిత్యవసర వస్తువుల పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కలక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. లారీల సమ్మె నేపథ్యంలో రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, కలక్టర్లతో సిఎస్ జోషి చర్చించారు. రాష్ట్రంలో లారీల లోడింగ్, అన్‌లోడింగ్‌కు హమాలీలు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ సిఎస్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ముందు అలా జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను సునీల్ శర్మ ఆదేశించారు.
ఓవర్ లోడింగ్ అరికట్టాలని, డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కలక్టర్లను సిఎస్ ఆదేశించారు.
గొర్రెల పంపిణీ మాదిరిగా చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా కలక్టర్లను ఆదేశించారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రూ.850 కోట్లతో దాదాపు 80 కోట్ల చేప పిల్లల సేకరణకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు.
చేపల పంపిణీకి జిల్లాస్థాయిలో మంజూరీ కమిటీలను ఏర్పాటు చేసి, ఆ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు. పాడి గేదెలను 2.13 లక్షల మంది పాడి రైతులకు పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలను కలక్టర్లకు సిఎస్ సూచించారు.