తెలంగాణ

ఢిల్లీకి చేరిన ఖమ్మం పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 17: అందరూ జాతీయ స్థాయి నేతలే కావటంతో ఆ జిల్లాకు రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే ఖమ్మం జిల్లా ప్రత్యేకమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా అభిప్రాయపడింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం ఖమ్మం జిల్లా కమిటీని మాత్రం నిర్ణయించలేకపోయింది. చివరకు ఎఐసిసి కార్యదర్శిగా ఉన్న సలీం అహ్మద్ ఖమ్మం వచ్చి నేతలతో చర్చించినా సాధ్యం కాలేదు. పీసీసీ దీనిపై నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసినా సాధ్యపడక ఎఐసిసి నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉంది. అయితే ఆ క్యాడర్ వర్గాలుగా విడిపోయి ఉండటంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ మాజీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ వర్గాలుగా నేతలు, కార్యకర్తలు విడిపోయి పనిచేస్తున్నారు. తాజాగా ఇటీవల పార్టీలో చేరిన పోట్ల నాగేశ్వరరావు తనదైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్ష పదవికి ఏదైనా పేరు తెరపైకి వస్తే వ్యతిరేక వర్గీయులు అడ్డుకుంటున్నారు. ఇటీవల కాలం వరకు భట్టి వర్గానికి చెందిన అయితం సత్యం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ మరణించారు. ఖాళీ అయిన స్థానంలో తిరిగి తమ వర్గానికి చెందిన దుర్గాప్రసాద్‌ను నియమించాలని భట్టి, భద్రయ్యను నియమించాలని రేణుక పోటీపడుతుండగా సీనియర్ నేతలు మాత్రం సుదీర్ఘకాలం నుండి పార్టీలో ఉన్న వడ్డెబోయిన నర్సింహరావు పేరును సూచిస్తున్నారు. అయితే పీసీసీ మాత్రం మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను నియమించాలని నిర్ణయించగా నేతలు అడ్డుకోవటంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కమిటీని వేయలేమని, నిర్ణయం తీసుకోవాలంటూ ఏఐసీసీ నివేదిక పంపించారు. దీంతో నేతలంతా ఢిల్లీ బాట పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో బలమైన కార్యకర్తలు ఉన్నప్పటికి వర్గాలతో పార్టీ బలహీన పడిందని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ నివేదిక ఇచ్చారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పంచాయతీ రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఢిల్లీకి చేరింది. ఈ నిర్ణయంతో పార్టీ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ నేతల మధ్య ఉన్న విభేదాలతో నష్టపోతున్నామంటూ కొందరు తమకు ఉన్న పరిచయాలతో ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ నెల చివరిలో నేతలంతా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి జిల్లాలో పరిస్థితి, డీసీసీ నియమకంపై చర్చించనున్నట్లు తెలిసింది.