తెలంగాణ

దిగజారిన ఆర్థిక పరిస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి విషమంగా మారిందని, చెల్లింపులు నిలిచిపోయాయని బీజేపీ మండిపడింది. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీవీఎస్ ప్రభాకర్ గురువారం నాడు రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం నిధులు తక్కువగా విడుదల చేసిందని, కళ్యాణ లక్ష్మీ చెక్కులు పిల్లలు పుట్టిన తర్వాత వస్తున్నాయని, పంట పెట్టుబడి రాగానే దళితులకు మూడు ఎకరాల హామీ ఎక్కడికి పోయిందని ఆయన నిలదీశారు. ఎమ్సెట్ , నరుూమ్ కేసులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తీర్పు వచ్చినా పట్టింపు లేదని, కొత్తవి వస్తే పాత పథకాలు ఆగిపోతున్నాయని, సంక్షేమం పడక వేసిందని, ఏసీబీ కేసులను ప్రభుత్వం నీరుకారుస్తోందని, పాస్ పుస్తకాలను ఇంకా ఇవ్వలేదని, పాలకపక్షం సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని అన్నారు. వర్షాకాల సమావేశాలు వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ వ్యవహారం చూసిన తర్వాత తాము కూడా స్పందిస్తామని అన్నారు.
రాష్ట్రంలో ఇంకా 10 లక్షల మందికి చెక్ పుస్తకాలు అందలేదని ఆయన చెప్పారు. వైద్య శాఖలో అవినీతి జరుగుతోందని, కళ్యాణ లక్ష్మీ చెక్కులు పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తున్నారని ఆరోపించారు. కొత్త పథకాలు పేరుచెప్పి పాత పథకాల అమలును అటకెక్కిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం పడకేసిందని చెప్పారు. స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కారం ఎత్తివేయాలని, స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్న వారిపై పోలీసులు ప్రతాపం చూపారని ఇది దారుణమని అన్నారు.