తెలంగాణ

పాత్రికేయుల రచనలు భవిష్యత్ జర్నలిస్టులకు మార్గథర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: జర్నలిజంలో విశేష అనుభవం గడించిన పాత్రికేయుల అనుభవాల ఆధారంగా వెలువడుతున్న రచనలు భవిష్యత్ జర్నలిస్టులకు మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ రచించిన ‘అక్షరాయుధం’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవీయ కోణంలో కథనాలు రచించిన పాత్రికేయుడు సత్యనారాయణ అని అన్నారు. తెలంగాణలోని నీటి కష్టాలు, కర్ణాటక రాష్ట్రం గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్యారేజీల వివరాలను సమగ్రంగా సేకరించి పరిశోధనాత్మక వార్తలు ఇక్కడి ప్రభుత్వాలను ఆలోచింప చేశాయని అన్నారు. పార్టీలో కూడా కీలకమైన పొలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేసిన ఆయనకు తగిన సమయంలో గుర్తింపు ఇస్తామన్నారు. సభా అధ్యక్షుడిగా మల్లేపల్లి లక్ష్మయ్య వ్యవహరించగా, మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ పుస్తక పరిచయం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు బీవీ పాటిల్, ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.