తెలంగాణ

గౌర్ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట సమరానికి ఊపిరిలూదిన రాజ్ బహదూర్ గౌర్ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని బహదూర్ శతజయంతి సభలో పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. శనివారం ఇక్కడ గౌర్ శతజయంతి ఉత్సవాల సభ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జరిగిన సభకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం, సాయుధ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు స్వాతంత్య్ర సమరయోధుడు జైన్ మల్లయ్య గుప్త హాజరై మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహా యోధుడు రాజ బహదూర్ అని కొనియాడారు. తొలితరం పార్లమెంటేరియన్‌గా ఆయన ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఐడిపీఎల్, బ్యాంకు, ఆర్టీసీ, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ల నిర్మాణంలో గౌర్ పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు.
జీవించినంత కాలం కార్మికుల హక్కుల కోసం పోరాడిన మహానేత అని శ్లాఘించారు. సాయుధ పోరాటంలో రావినారాయణరెడ్డి, మఖ్దూం మొహినుద్దీన్, రాజబహదూర్ గౌర్‌లు నిర్వహించిన పాత్ర మరవలేనిదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తీవ్ర నిర్భందాల మధ్య కార్మికుల హక్కుల కోసం పోరాటం సాగించిన బహదూర్ నేటి తరం వారికి ఆదర్శప్రాయుడని కోదండరామ్ అన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను పరిరక్షించుకోవాలని పిలుపు నిచ్చారు.