తెలంగాణ

పారిశ్రామికవేత్తలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు చేయూత ఇస్తుందని రాష్ట్ర పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) హామీ ఇచ్చారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ దీపక్ ఖేత్రపాల్ శనివారం ఇక్కడ మంత్రి కేటీఆర్‌ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికపెట్టుబడులను ఆహ్వానిస్తోందని, గత నాలుగేళ్లలలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. పరిశ్రమల ఏర్పాటుకోసం అనుమతులు సులభంగా ఇస్తున్నామన్నారు. భూముల కేటాయింపు, విద్యుత్తు, నీటి సరఫరా తదితర విషయాల్లో ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇస్తోందన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ తమ సిమెంట్ ప్లాంట్‌ను విస్తరించేందుకు ముందుకు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
దీపక్ ఖేత్రపాల్ ఈ సందర్భంగా మంత్రితో మాట్లాడుతూ, మంచిర్యాలలో ఉన్న తమ కంపెనీలో ప్రస్తుతం సిమెంట్ ఉత్పత్తి ఏటా మూడు మిలియన్ టన్నులుగా ఉందన్నారు. తమ కంపెనీని విస్తరించిన తర్వాత ఈ సామర్థ్యం 7.50 మిలియన్ టన్నులకు పెరుగుతుందని వివరించారు. తమ కంపెనీకి ప్రాథమిక పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయని, తుది అనుమతులు రావలసి ఉందన్నారు. అనుమతి రాగానే రెండువేల కోట్ల రూపాయలతో తమ సిమెంట్ కంపెనీని విస్తరిస్తామన్నారు.
విస్తరణ పూర్తయితే ప్రత్యక్షంగా నాలుగువేల మందికి ఉపాధి లభిస్తుందని, పరోక్షంగా ఎనిమిదివేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.