తెలంగాణ

కాంగ్రెస్ వల్లే తెలంగాణలో కరెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 21: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి వెళ్లిన ఏ జిల్లాలో పర్యటించిన తెలంగాణలో 24గంటల కరెంట్‌ను సరఫరా చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నానని, అసలు విషయం కేసీఆర్‌కు తెలిసి కూడా ఆ క్రెడిట్ ఇతరుల ఖాతాలో పడకూడదనే దుర్బుద్ధితో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ బిల్లును రూపొందించేటప్పుడు అందులో తెలంగాణకు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పొందుపర్చామని, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 54శాతం తెలంగాణకు ఇవ్వాలని ఉండడంతోనే ప్రస్తుతం కరెంట్‌ను వస్తుందని గుర్తుచేశారు. ఇది కాంగ్రెస్ రూపొందించిన అంశమని 24గంటల కరెంట్ సరఫరా కాంగ్రెస్ క్రెడిట్ పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులైన ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సన్మాన సభ శనివారం మహబూబ్‌నగర్ క్రౌన్‌ఫంక్షన్‌హల్‌లో జరిగింది. సభకు సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డి, వీహెచ్, భట్టి విక్రమార్క, చిన్నారెడ్డిలు హాజరయ్యారు. ఈసందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ నిర్ణయంతోనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ రావడానికి తాను సోనియాగాంధీతో కొన్ని నెలల తరబడి గంటల తరబడి చర్చించి ఒప్పించానని వెల్లడించారు. అంతేకాకుండా ఆంధ్రా ఎంపీలు భద్రాద్రి దేవాలయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని డిమాండ్ చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు గతంలో తూర్పుగోదావరి జిల్లాలో భద్రాద్రి దేవాలయం ఉండేదని అలాగే ఉంచాలని కూడా తెరపైకి తెచ్చారని తెలిపారు. కానీ హైదరాబాద్‌కు భద్రాద్రి దేవాలయానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను ముస్లీం ప్రభువులు ఈ దేవాలయానికి చేసిన కృషిని ముందుంచి తెలంగాణ రాష్ట్రంలోనే ఉండేలా తాను ప్రత్యేకంగా కృషి చేశానని ఎంపీ జైరాం రమేష్ అప్పుడు మెతక వైఖరి వహించారన్నారు. పార్లమెంట్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా కేసీఆర్ నిజస్వరూపం బయటపడిందని మోదీకి కేసీఆర్ పక్కాగా శిష్యుడేనని నిరూపించుకున్నారన్నారు. ఇక మీదట ఎవరైన టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే బీజేపీకి ఓట్లు వేసినట్లేనని తెలిపారు. చంద్రబాబును చీదరించి మాట్లాడిన మోదీ కేసీఆర్‌ను మెచ్చుకుంటూ మాట్లాడడమే అందుకు నిదర్శనమని ప్రజలందరు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. దేశాన్ని బీజేపీ, మోదీ నుండి విముక్తి కల్పించాలని 2019 ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తప్పకుండా ఓడించాలని కోరారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కూడా ప్రజలు భయాంధోళనలో ఉన్నారని ప్రశ్నించేవారి గొంతునొక్కుతున్నారన్నారు. అలాగే నాయకులు సోషల్ మీడియా ఉచ్చులో పడకూడదని పత్రికలు చదువుతూ సంపాదకీయాలు, వ్యాసాలు చదివితే చాలా విషయాలు తెలుస్తాయని ఇప్పుడున్న నాయకులు వీటిపై దృష్టి సారించాల్సిన ఎంతైన ఉందని జైపాల్‌రెడ్డి హితవు పలికారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హన్మంతరావు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సంస్కారహీనంగా తయారుయ్యారని రాహుల్‌గాంధీని చూసి సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్‌లో తన ప్రసంగాన్ని ముగిసిన తర్వాత మోదీని కలిసి ఆలింగనం చేసుకోవడం అంటే సంస్కారం అని అన్నారు. నిన్నటివరకు రాహుల్‌ని పప్పు అన్నా బీజేపీ నాయకులు ఇప్పుడు పప్పా అంటున్నారని ఛలోక్తులు విసిరారు. వ్యక్తులపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాడి చేయదని కేవలం విధానాలపైనే ప్రశ్నించడం జరుగుతుందనే సంకేతాలను అన్ని రాజకీయ పార్టీలకు రాహుల్‌గాంధీ విసిరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లురవి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.