తెలంగాణ

అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 100 కోట్ల మొక్కలు నాటాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
* అటవీ అభివృద్ధికి కేంద్రం రూ.2,200 కోట్లు బకాయ
* నిధుల విడుదలలో మోదీ సర్కార్ నిర్లక్ష్యం..
* కొత్త చట్టం ప్రకారం మొక్కల సంరక్షణ పంచాయతీలదే..
గజ్వేల్, జూలై 21: నిర్లక్ష్యానికి గురైన అడవుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని నర్సంపల్లి, సింగాయపల్లి, సంగాపూర్, కోమటిబండ అటవీ ప్రాంతాలను పరిశీలించడంతోపాటు మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అటవీ అధికారులతో సమీక్షించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని సమతుల్యత లక్ష్యంగా 100కోట్ల మొక్కలు నాటి సంరక్షించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మొక్కలు నాటడంతోపాటు 80 శాతం సంరక్షించే బాధ్యత సర్పంచ్‌లు, కార్యదర్శులదేనన్నారు. అయితే మొక్కలు కాపాడని పక్షంలో వారు పదవుల నుండి వైదొలగాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం రూ.2,200 కోట్లు అటవీ అభివృద్ధికి కేటాయించాల్సి ఉందని, అయితే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా తగిన ఫలితాలు రాబట్టలేకపోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 22 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉండి హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అడవుల పునరుజ్జీవంతోపాటు జంతువులు ప్రవేశించకుండా చూడడం, అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్‌లైన్‌లు ఏర్పాటు చేయడంపై దృష్టిసారించగా, ప్రతి హెక్టారులో మొక్కలు నాటేందుకు రూ.5లక్షల నుండి రూ.6లక్షల వరకు ఖర్చవుతుందని అన్నారు. గజ్వేల్ బ్లాక్ పరిధిలో 278 హెక్టార్లలో మొక్కలు నాటి ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పా రు. గత 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో 72కోట్ల మొక్కలు నాటగా, ప్రతి జిల్లాకు కోటి 57లక్షలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల సంరక్షణకు అటవీ భూముల్లో టమాటా గ్రాస్ పెంచి వాటిపై యాదవులు, గొల్లకుర్మలకు హక్కులు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమాల్లో పీసీసీఎఫ్ పీకేజా, ఫారెస్టు జిల్లా అటవీ అధికారి శ్రీ్ధర్ రావు, గడా అధికారి హన్మంతరావు, కార్పొరేషన్ చైర్మన్‌లు భూంరెడ్డి, భూపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ భూపాల్‌రెడ్డి, ఫారెస్టు రేంజ్ అధికారి వెంకట్ రామారావు, మిషన్ భగీరథ డీఈఈ నాగార్జున్‌రావు పాల్గొన్నారు.