తెలంగాణ

కాంగ్రెస్‌ను వీడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: ‘కాంగ్రెస్ పార్టీని వీడకండి ప్లీజ్..’ అని పార్టీ తెలంగాణ కమిటీకి ఇటీవల ఇన్‌ఛార్జీగా నియమితులైన ఎఐసిసి కార్యదర్శి బోసు రాజు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎం. ముఖేష్ గౌడ్‌ను కోరారు. ముఖేష్ గౌడ్ పార్టీ మారుతారన్న ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 20 రోజుల క్రితం టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖేష్ గౌడ్ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయినా ముఖేష్ గౌడ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బోసు రాజు మంగళవారం ముఖేష్ గౌడ్ నివాసానికి వెళ్ళి మంతనాలు జరిపారు. పార్టీని వీడరాదని, పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని ఆయనకు నచ్చజెప్పారు. వచ్చే నెలలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్నారని, అప్పుడు అధినేతతో మాట్లాడిస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది. అనంతరం బోసు రాజు తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ మరిన్ని కార్యక్రమాలతో, పోరాటాలతో ప్రజలకు చేరువకానున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ముఖేష్‌ను కలవడంలో ప్రాధాన్యత ఏమీ లేదని, లోగడ ఫోన్‌లో మాట్లాడానని, ఇప్పుడు స్వయంగా కలుద్దామని వెళ్ళానని అన్నారు.
ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ తాను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని చెప్పారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా వంద డివిజన్లలో ప్రచారం చేశానని ఆయన గుర్తు చేశారు. పార్టీ మారుతున్నానని తాను ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదన్నారు. గాంధీ భవన్‌కు సమీపంలోనే తన నివాసం ఉందని, తాను ఇంట్లో ఉన్నా, గాంధీ భవన్‌లో ఉన్నట్లేనని అన్నారు. పార్టీ పరిస్థితిపై తాను బోసు రాజుతో చర్చించానని, ఇంకా పార్టీ సీనియర్లతో చర్చిస్తానని ఆయన తెలిపారు.