తెలంగాణ

దండకారణ్యంలో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, జూలై 24: గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తిరిగి కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రాచలం ఏజెన్సీ చర్ల మండల పరిధిలోని దండకారణ్యంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందాడు. చర్ల మండల పరిధిలోని కుర్నపల్లి పంచాయితీ సమీపంలో ఉన్న నిమ్మలగూడెం - పుట్టెపాడు గ్రామాల మధ్య దండకారణ్యంలో గత మూడురోజులుగా స్పెషల్‌పార్టీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీరికి మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఎల్‌వోఎస్ కమాండర్ సుంకరి రాజ్‌కుమార్ అలియాస్ అరుణ్(38) మృతి చెందగా మరో ముగ్గురు మావోయిస్టులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతి చెందిన అరుణ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లి గ్రామానికి చెందిన వాడని తెలుస్తోంది. మృతదేహం వద్ద 303 తుపాకీ, నిత్యావసర సామాగ్రి లభ్యమయ్యాయి. మృతదేహాన్ని ట్రాక్టర్‌లో సత్యనారాయణపురం బేస్‌క్యాంపుకు తీసుకొచ్చి పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.