తెలంగాణ

కొనసాగుతున్న లారీల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: తమ సమస్యలను పరిష్కరించాలంటూ లారీ యజమానులు చేపట్టిన సమ్మె నేటితో ఆరవ రోజుకు చేరుకుంది. పెట్రోల్, డిజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం తో పాటు టోల్‌గేట్ ఫ్రీ ఇండియాగా ప్రకటించాలన్న ప్రదాన డిమాండ్లతో జాతీయ స్థాయిలో లారీ యజమానులు సమ్మెకు పిలుపు నిచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సుమారు మూడు లక్షల లారీలు ఎక్కడివి అక్కడే నిలిచి పోయాయి.
లారీ సమ్మె ప్రభావం బియ్యం, పప్పుదినుసులపై భారీగా ఉంది. ఉత్తరాధి రాష్ట్రాల నుంచి వచ్చే సరుకులు పూర్తిగా నిలిచి పోవడంతో ఆయా వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లారీల సమ్మెకు మద్దతుగా మంగళవారం పెట్రోల్, డిజిల్ సరఫరా చేస్తున్న ఆయిల్ ట్యాంకర్లను సైతం నిలిపివేశారు. దీంతో ప్రజా జీవనం అస్థవ్యస్థం కానుంది.
సమ్మెను విరమింపచేయండి: తమ్మినేని
లారీల సమ్మెను విరమింప చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
గత ఐదు రోజులుగా కొనసాగుతున్న సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉత్తరాధి నుంచి వస్తున్న సరుకు పూర్తిగా నిలిచి పోవడంతో నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయని అన్నారు. ఆయిల్ ట్యాంకర్లు సైతం సమ్మెకు మద్దతుగా నిలవడంతో ప్రజలు నానా కష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకొని సమ్మెను తక్షణమే విరమింప చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నూతనంగా తీసుకురాదలచిన నూతన మోటర్ వాహన బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.
ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను లాకొనేదిగా ఉండటంతో పాటు కోట్లాది మంది ఉపాధిని కభలించేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.