తెలంగాణ

25నుంచి దోస్త్ తుది కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో యూజీ కోర్సుల్లో చేరేందుకు దోస్త్ తుది విడత కౌనె్సలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి మంగళవారం నాడు ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని, 27వ తేదీ వరకూ అందుకు గడువు ఉంటుందని, 25 నుండి 28 వరకూ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని, గతంలో సీటు పొందని వారు లేదా సీటు పొందినా చేరని వారు కూడా ఈసారి తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని వారు తెలిపారు. కాలేజీలో కోర్సు మారడం, లేదా గ్రూప్ , మీడియం మార్పునకు కూడా 28వ తేదీ వరకూ గడువు ఉంటుందని అన్నారు. 30వ తేదీన తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుందని, 31వ తేదీన ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇంత వరకూ అన్ని దశల్లో 1,88,205 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని వారు వివరించారు.
26 నుంచి ఐసెట్ కౌనె్సలింగ్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 26 నుండి కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. 26, 27 తేదీల్లో ఆన్‌లైన్‌లో డాటా అందించాలని, 27న సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందని, 27 నుండి 29 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని, 31న సీట్ల కేటాయింపు జరుగుతుందని అన్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 31 నుండి రెండో తేదీలోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని, స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను జూలై 30న విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

టెక్ మహీంద్రలో ప్రాంగణ నియామకాలు
టెక్ మహేంద్ర ఎకోలా సెంట్రల్‌లో జరిగిన ప్రాంగణ నియామకాల్లో ఇంజనీరింగ్ విద్యార్థి గాడి రెడ్డి కరుణాకర్ , రవినితేష్ రెడ్డిలకు ఏటా 30 లక్షల వేతనానికి ఎంపికయ్యారు. గ్రౌండ్ ఇన్‌కార్పొరేషన్ సంస్థ వీరికి ఆఫర్ లేఖలు ఇచ్చింది. ప్రాంగణ నియామకాలే లేని పరిస్థితుల్లో అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు తమ అభ్యర్ధులకు అవకాశాలు కల్పించడం సంతోషంగా ఉందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ మేడూరి యాజులు తెలిపారు.
గ్రాఫాలజిస్టుకు అంతర్జాతీయ ఖ్యాతి
తెలంగాణకు చెందిన గ్రాఫాలజిస్టు సమితా పాండ్యాకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. అమెరికా అసోసియేషన్ ఆఫ్ హాండ్ రైటింగ్ అనాలసిస్ సంస్థ- ఆహాలో సభ్యత్వం దక్కింది.
ఇంగ్లీషు, తెలుగు, తమిళం, గుజరాతీ భాషల్లో ఆమె పట్టుసాధించారు. చేతి రాత విశే్లషణ, చేతి రాత మెరుగుపరచడంలో ఆమె ప్రావీణ్యాన్ని పొందారు. భారత్ నుండి ఆహాలో సభ్యత్వం నుండి మహిళగా ఆమె ప్రత్యేకతను పొందారు.