తెలంగాణ

బీజేపీ కోసమే ఫ్రంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: దేశంలో మరో సారి భారతీయ జనతా పార్టీని గద్దెనెక్కించేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఫ్రంట్ జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకేనని అన్నారు. ఫ్రంట్‌ను స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అనడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మతోన్మాద బీజేపీ గద్దె దించడమే అజెండాగా సీపీఐ జాతీయ మహాసభలు కొనసాగాయని తెలిపారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాజకీయ తీర్మానాల్లో ఎలాంటి తేడాలు లేవని ఒకే విధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. దేశంలో రాబోయే రోజుల్లో వామపక్షాలను మరింత బలోపేతం చేసి ప్రయత్యామ్నాయ రాజకీయ వేదికను ప్రజల ముందు ఉంచనున్నామని తెలిపారు. కర్ణటక ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఐక్యం కావడం శుభపరిణామమన్నారు. రాజకీయ విధానంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తో తాము పూర్తిగా విబేధిస్తున్నట్టు చెప్పారు. ఫ్రొఫెసర్ కోదండరామ్ సారధ్యంలోని టిజెఎస్ తో కలిసి పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. బీజేపీ, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా విశాల వేదికను ఏర్పాటు చేసి పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఒకే పార్టీతో పొత్తులు ఉండబోవని, ప్రాంతీయ పరిస్థితులను ఆధారంగా ఎన్నికల సమయంలో పొత్తులు ఉంటాయని చెప్పారు. ఎర్రకోట నిర్వహనను ప్రైవేట్‌కు అప్పగించడంపై సురవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారా అని నిలదీశారు.
జాతీయ సమితిలో
తొమ్మిది మందికి చోటు...
కేరళ రాష్ట్రం కొల్లంలో జరిగిన సీపీఐ 23వ జాతీయ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది నేతలకు చోటు దక్కింది. జాతీయ కార్యవర్గ సభ్యులుగా చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, శ్రీనివాస రెడ్డి, పశ్యపద్మ, తక్కళ్ళపల్లి శ్రీనివాస రావు, శంకర్, బాలనర్సింహలతో పాటు కేంద్ర కంట్రోల్ కమీషన్ సభ్యులుగా నరసింహన్‌లు నియమితులయ్యారు.