రాష్ట్రీయం

ఘరానా మోసగాడి ఆటకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపిహెచ్‌బీకాలనీ, జూలై 30: తాను ప్రిన్సిపల్ సెక్రెటరీని నంటూ ప్రభుత్వ అధికారులను మోసగిస్తున్న వ్యక్తిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. ఇందిరాపార్క్ ఎల్‌ఐసీ కాలనీలో నివాసం ఉండే విజయ్ కుమార్ (42) గతంలో సత్యం కంప్యూటర్స్‌ర్‌లో ఉన్నత ఉద్యోగిగా విధులు నిర్వహించాడు. అనంతరం డిజిటల్ పీసీ టెక్నాలజీస్ పేరుతో స్వంత సంస్థను స్థాపించాడు.
వివిధ ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసి విక్రయించే వాడు. 2008వ సంవత్సరంలో నార్సింగ్, పుప్పుగూడలోని సర్వేనెంబర్ 295/ ఏలోని ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సదరు భూమిని డవలప్‌మెంట్ కోసం ఇచ్చేందుకు ప్రయత్నించగా అవి పోర్జరీ డాక్యుమెంట్లు అని తేలింది. భారీగా వెచ్చించిన కొనుగోలు చేసిన భూమి దకక్కపోవడంతో నిందితుడు మద్యానికి బానిస అయ్యాడు. ఎలాగైనా భూమిని దక్కించుకోవాలని పధకం రచించాడు. అందుకు అనుగుణంగా డిస్ట్రిక్ట్ రిజిస్టార్ సుబ్బారావు ఫోన్ చేసి తాను ప్రిన్సిపల్ సెక్రెటరీని మాట్లాడుతున్నానని 789/2017 నెంబర్‌పై ఉన్న పెండింగ్ ఫైల్‌ను క్లీయర్ చేసి, డాక్యుమెంట్‌ను ఇవ్వాలని సూచించాడు. తాను వేణు అనే వ్యక్తిని కార్యాలయానికి పంపుతానని అతనికి వచ్చి డాక్యుమెంట్ పంపాలని సూచించాడు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సుబ్బారావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో డాక్యుమెంట్ కోసం వచ్చిన వేణును ఈనెల 23న పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. అప్పటి నుంచి తప్పించుకుతిరుగుతున్న నిందితు విజయ్ కుమార్ చాణక్యను సోమవారం పోలీసులు అరెస్టు చేసి విచారించగా తానే చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు
విచారణలో విజయ్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేసిన భాస్కర్ కుమారుడని తేలింది. కుటుంబ సభ్యులందరూ ఉన్నత ఉద్యోగులుగా ఉండగా, విజయ్ కుమార్ ఒక్కడే ఇలా తయారైనట్టు నిర్ధారించారు. కూకట్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.