తెలంగాణ

జోగిని శ్యామల శాపం సర్కారుకు మంచిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: జోగిని శ్యామల శాపం కేసీఆర్ సర్కారుకు మంచిది కాదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. జోగిని చెప్పినవన్ని గతంలో నిజాలు అయ్యాయని అన్నారు. తెలంగాణలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలనే ఆమె వివరించిందని చెప్పారు. కేసీఆర్ కుమార్తె కవిత బోనం ఎత్తుకుంటేనే బోనాల పండుగ అన్నట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ఎంత మాత్రం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలు ఉండగా కొత్త బీసీ గణన దేనికని ప్రశ్నించారు. రిటైర్ట్ అధికారులకు పదవీ కాలాన్ని పొడగిస్తున్న కేసీఆర్ సర్పంచులకు ఎందుకు ఇంచార్జ్‌లుగా అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆగస్టు2 నుంచి విధులు నిర్వహించనున్న స్పెషల్ ఆఫీసర్లపై సర్పంచులు తిరగబడాలని, వారికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందన్నారు. ఓటమి ఊహించే సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం కుట్రతో వాయిదా వేసిందని విమర్శించారు.