తెలంగాణ

మిషన్ కాకతీయ, భగీరథకు నిధులు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నీటి పారుదల ప్రాజెక్టులు, గురుకుల విద్యాలయాలు, కొత్త జిల్లాలు, రోడ్ల నిర్మాణం తదితర వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘానికి సమర్పించే ప్రతిపాదనలపై సీఏస్ జోషి వివిధ శాఖలకు చెందిన అధిపతులతో సచివాలయంలో సోమవారం కసరత్తు చేసారు.
ఈ సందర్భంగా సీఏస్ మాట్లాడుతూ, 2020-25 సంవత్సరాలకు సంబంధించి ఎన్‌కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘానికి సమర్పించే ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు సమర్పించాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవిన్యూ, రోడ్లు, భవనాలు, వ్యవసాయం, మున్సిపల్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, వైద్యం తదితర ముఖ్యమైన శాఖలకు అవసరమైన నిధులపై ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన నిధులు, వ్యయం, ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి తదితర అంశాలను ప్రణాళికలలో పొందుపర్చాలని సూచించారు. స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు, సంక్షేమ శాఖలన్నీ తమ నివేదికల్లో ఒకే తరహాగా తయారు చేయాలన్నారు. పంట రుణాల మాఫీ, రైతు బీమా, రైతుబంధు, విద్యుత్ సరఫరా నష్టాలు, వివిధ రంగాలలో ప్రభుత్వం సాధించిన విజయాలు పరిశ్రమల రంగంలో ప్రగతి తదితర అంశాలన్ని నివేదికలో పొందుపర్చాలని సీఏస్ సూచించారు.