తెలంగాణ

రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 30: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల పిదప అధికార మార్పిడి తథ్యమని, ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, నూతన ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ నిర్ణయాత్మక భూమిక పోషించనుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం నల్లగొండ గడియారం సెంటర్‌లో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మాదగోని శ్రీనివాస్‌గౌడ్ సారధ్యంలో నియోజకవర్గ సమస్యల సాధన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతు సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఉద్యమంలో చెప్పిన నీళ్లు, నిధులు, ఉద్యోగాల మాటలను గాలికి వదిలేసిన కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో డబుల్ బెడ్‌రూమ్, దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, కెజీ టూ పిజీ ఉచిత విద్య, గిరిజన, మైనార్టీ రిజర్వేషన్లు వంటి హామీల అమలులో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కమిషన్ల కోసం కాళేశ్వరం వంటి కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తు గతంలో నల్లగొండ జిల్లా ప్రజల కరవు, ఫ్లోరైడ్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మార్గం ప్రాజెక్టుకు 1500కోట్ల నిధులివ్వడం లేదన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పగా మరో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీ అవ్వగా ఇప్పటిదాకా 15వేల ఉద్యోగాలే కెసిఆర్ ఇచ్చారన్నారు. ప్రజాధనం ఇష్టారాజ్యంగా రాజరికపు పోకడలతో దుర్వినియోగం చేస్తున్న సీఎం కేసీఆర్ ధనిక రాష్టమ్రైన తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చాడన్నారు. 6.80లక్షల కోట్ల బడ్జెట్‌లో ఇప్పటిదాకా 5.30లక్షల కోట్లు ఖర్చు చేసి బంగారు తెలంగాణ సాధించకపోగా కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారిందన్నారు. కొత్త జిల్లాలు, మండలాల విభజనతో పాలన అస్తవ్యస్తం చేశారని, జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వేయి పడకల ఆసుపత్రి కడతామని చెప్పి కట్టలేదని, ప్రగతి భవన్ పేరిట ఇల్లు మాత్రం కట్టుకున్నారన్నారు. గట్టుప్పల్ మండలం ఇస్తామని చెప్పి వెనక్కి వెళ్లారన్నారు. పేదల పార్టీ టీడీపీతోనే బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను ప్రజా ఆసుపత్రిగా మారుస్తామన్నారు. మంత్రి మండలిలో మహిళలకు స్థానం ఇవ్వకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూసిందన్నారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చేసిందేమి లేదని వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం బలహీన వర్గాల నేత మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ను గెలిపించుకోవాలని కోరారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి, పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఈ.పెద్దిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీర్ పాలనా విధానాలను తూర్పారబట్టారు. నియోజకవర్గ కన్వీనర్ మాదగోని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం సమస్యలపై టీడీపీ బహిరంగ సభ ప్రకటించగానే రాష్ట్ర ప్రభుత్వం రూ. 50కోట్లు విడుదల చేసిందని, మరో రూ.100కోట్లు కేటాయించి సమస్యలు పరిష్కరించని పక్షంలో టీడీపీ ఉద్యమాలు ఉద్ధృతం చేస్తుందన్నారు. నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లుకూడా నేటికీ పూర్తి చేయలేదని, కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదని, మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. క్రమశిక్షణా కార్యదర్శి బక్కాని నరసింహులు, టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్వాయి రజనీ కుమారి, బంటు వెంకటేశ్వర్లు, గుల్లపల్లి బుచ్చిలింగం, సిలివేరు కాశీనాథ్, ప్రధాన కార్యదర్శులు నెల్లూరి దుర్గాప్రసాద్, జక్కలి ఐలయ్య యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎండి.యూసఫ్, నాయకులు పాల్గొన్నారు.