తెలంగాణ

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళగా ఉన్న జనరల్ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, సంబంధిత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి సిఎండి శ్రీ్ధర్‌కు ఆ సంస్థ ఉద్యోగుల అసోషియేషన్ సూచించింది. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవనంలో అసోషియేషన్ అధ్యక్షడు గడిపల్లి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి ఆగనైజేషన్ ప్యాటర్నును త్వరగా ఖరారు చేయాలని, ఓకే పోస్టులో 7 ఏళ్ళపైబడి ఉంటున్న అధికారులకు తదుపరి ప్రమోషను ఒక్కసారి ఇస్తున్న అవకాశంగా మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2017-18 సంవత్సరానికి పిఆర్‌పిని చెల్లించాలని, జూనియర్ అధికారులతో వేతన వ్యత్యాస సమస్యలను పర్కిఃరించి, ఖాళీగా ఉన్న జిఎం ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు సిఎండి కోరారు. 2017లో సంస్థ డైరెక్టర్ల సమావేశంలో స్ట్రక్చర్డ్‌లకు సంబంధించిన సమస్యలపై చర్చించనప్పటికీ ఎక్కువ శాతం పరిష్కరించేలేదని ఆయన చెప్పారు. ప్రమోషన్ పొందిన అధికారులకు లాప్‌టాప్ ఇవ్వాలని, కోలిండియా మాదిరిగా అధికారులకు డిజిగ్నేషన్ల పేర్లు మార్చాలని సిఎండికి సూచించగా ఆయన అన్ని విషయాలపై సమీక్షీస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సిఎండిని కలిసిన వారిలో జనరల్ సెక్రటరీ ఎన్‌వి రాజశేఖరరావు, సిఇసి సభ్యులు చంద్రవౌళి తదితర అధికారులు పాల్గొన్నారు.