తెలంగాణ

మరో 20వేల మందికి సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. తుది విడత అడ్మిషన్లను మంగళవారం నాడు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. తుది విడతకు 20,741 మంది వెబ్ ఆప్షన్లను ఇవ్వగా, 19,145 మందికి సీట్లు దక్కాయి. 5397 మంది స్లయిడింగ్‌కు దరఖాస్తు చేసుకోగా, అందులో 4120 మంది స్లయిడింగ్ చేసుకున్నారని పేర్కొన్నారు. మొత్తం మీద 1,84,853 మందికి డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా సీట్లు వచ్చాయని ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. సీట్లు పొందిన అభ్యర్ధులు ఆగస్టు 1వ తేదీలోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు.
అక్షయపాత్రకు ఆ బాధ్యత వద్దు: పీడీఎస్‌యూ
మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయ పాత్రకు అప్పగించవద్దని పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి బి రాము కోరారు. కాంట్రాక్టుకు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఆహార నాణ్యత లోపించే ప్రమాదం ఉందని వారు చెప్పారు.
ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ ఫలితాలు వెల్లడి
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను వర్శిటీ ఉపకులపతి కవితా దర్యానీరావు విడుదల చేశారు. బిఎఫ్‌ఎలో 639 మంది ఉత్తీర్ణులు కాగా, ఫోటోగ్రఫీలో 338 మంది విద్యార్థులు, బీ డిజైన్‌లో 278 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఆగస్టు రెండో వారంలో వర్శిటీలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఫణిశ్రీ, అడ్మిషన్స్ కో ఆర్డినేటర్ కొడాలి సుందర్ కుమార్, ఏ ఆర్ అలంగిరి రేణుక, జీ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
3న పీఎం భార్గవ స్మారక ఉపన్యాసం
ఆగస్టు 3వ తేదీన ‘కెన్ ఎన్‌లైట్‌మెంట్ ప్రివెంట్ ఆస్విజ్’ పేరిట పీఎం భార్గవ స్మారక ఉపన్యాసాన్ని నిర్వహిస్తున్నట్టు మంథన్ ఇండియా పేర్కొంది. ఈ ఉపన్యాసం ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన అపూర్వానంద చేస్తారని సంస్థ పేర్కొంది.
యూజీసీ నెట్ ఫలితాలు వెల్లడి
యూజీసీ నెట్ ఫలితాలను రికార్డుసమయంలో సీబీఎస్‌ఈ ప్రకటించింది. పరీక్షకు 11,48,235 మంది రిజిస్టర్ చేసుకోగా, 8,59,498 పరీక్షకు హాజరయ్యారు. జెఆర్‌ఎఫ్‌కు 3929 మంది అర్హత సాధించగా, వారితో పాటు మొత్తం నెట్‌లో అర్హులైన వారి సంఖ్య 55,872 .
ఐసెట్ సీట్ల కేటాయింపు
ఐసెట్ తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఐసెట్‌లో 49812 మంది అర్హత సాధించగా, అందులో సర్ట్ఫికేట్ల పరిశీలనకు 28179 మంది హాజరయ్యారు. 13614 మంది తమ వెబ్ ఆప్షన్లను నమోదుచేశారు. రాష్ట్రంలో 343 కాలేజీల్లో కలిపి 25,912 సీట్లున్నాయి. ఇంత వరకూ 23,152 సీట్లు భర్తీ చేశామని అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. తొలి దశలో 2760 సీట్లు మిగిలాయని, తాజాగా 8603 మందికి సీట్లు ఇచ్చామని, అందులో 2641 మంది స్లయిడింగ్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 222 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ కాగా, ఒక్క కాలేజీలో మాత్రం ఒక్కరు కూడా చేరలేదని అన్నారు. ఇలా ఉండగా, ఇక్ఫాయి డీమ్డ్ యూనివర్శిటీ స్నాతకోత్సవం ఆగసర్టు 2వ తేదీ మధ్యాహ్నం శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ సుధాకరరావు చెప్పారు. కార్యక్రమానికి ట్యూబ్ ఇనె్వస్టుమెంట్ ఎండీ వెల్లాయన్ సుబ్బయ్య హాజరవుతారని తెలిపారు.