తెలంగాణ

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి అమర్‌జిత్ సిన్హా తెలిపారు. ‘రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు-లక్ష్యం-విధాన రూపకల్పన’ అంశంపై హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని జాతీయ ఉపాధిహామీ ఫథకంతో అనుసంధానం చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యవసాయాన్ని ఉపాధిహామీ పథకంలో అనుసంధానం చేశామని, దాంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని అన్నారు. పంటలకు పెట్టుబడులు (ఇన్‌పుట్) తగ్గించడం, మార్కెటింగ్ సౌకర్యం మెరుగుపరచడం, అవసరమైన మేరకు గిడ్డంగుల నిర్మాణం వల్ల సత్ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో రైతులకు అవసరమైన ఆస్తుల కల్పనకు వీలవుతుందన్నారు. కూలీల వేతనాలు స్థిరంగా ఉన్నప్పటికీ విత్తనాలు, ఎరువుల తదితర ఖర్చులు గణనీయంగా పెరిగాయని వివిధ సర్వేలవల్ల తేలిందన్నారు.
వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను రైతులు చేపట్టడం వల్ల రైతుల తమ ఆదాయం పెంచుకునేందుకు వీలవుతుందని అమర్‌జిత్ సిన్హా తెలిపారు. మైక్రోఇరిగేషన్, ఉద్యానం, పాడిపరిశ్రమ, గొర్రెల పెంపకం, తదితర రంగాలను రైతులకు చేరువగా తీసుకురావలసి ఉందన్నారు. ప్రకృతివనరుల యాజమాన్యం, వౌలికసదుపాయాలను అందుబాటులోకి తేవడం, పర్యావరణ పరిరక్షణ, పరిశోధన-అభివృద్ధి- విస్తరణ, రిస్క్‌మేనేజ్‌మెంట్-సమీకృత విధానాలు, మార్కెటింగ్ సౌకర్యం, వ్యవసాయేతర ఆదాయం తదితర అంశాలవల్ల రైతులకు లబ్ది చేకూరుతుందని వివరించారు.
రైతుల ఆదాయం పెంచేందుకు తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం చేపట్టామని, రైతులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, పాడిపరిశ్రమకు చేయూత ఇస్తున్నామని, చేపలపెంపకం పెద్ద ఎత్తున చేపడుతున్నామని, గొర్రెల పెంపకానికి చేయూత ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి వివరించారు. హరితహారం పథకాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నందువల్ల ఉపాధిహమీ పథకానికి తెలంగాణకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు.
రైతుల ఆదాయం పెంచేందుకు వివిధ వర్గాల వారి సూనచలు, సలహాలను తీసుకునేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశామని రాష్ట్ర వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి వెల్లడించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తగిన సూచనలను చేయాలని కోరారు.