తెలంగాణ

విద్యుత్ పంపిణీలో మేటి తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: విద్యుత్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్‌ను పంపిణీ చేసిన ఘనత దేశంలో తెలంగాణ టాప్‌లో ఉందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అమోగమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందని విమర్శంచిన నేతలకు ఇప్పుడు నోరుపెగలడం లేదని ఆయన ధ్వజమెత్తారు. విద్యుత్ లోటును ముందే గుర్తించిన కేసీఆర్ నాలుగేళ్ళలో అధిక విద్యుత్ ఉత్తత్తిని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మంగళవారం విద్యుత్ సౌధలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రితో పాటు ట్రాన్స్‌కో జన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు, డిస్కంమ్‌ల సిఎండిలు రఘుమారెడ్డి, గోపాల్‌రావు, జెఎండి శ్రీనివాసరావు సంయుక్తంగా పాల్గొంన్నారు. జూలై 31వ తేదీన అత్యధికంగా విద్యుత్ డిమాండ్ 10.429 మెగావాట్లకు చేరుకుందని, ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పుడు కేవలం 6660( 23-3-2014) మెగావాట్ల విద్యుత్ సరఫరా ఉండేదని ప్రస్తుత అవసరాలు దృష్టిలో పెట్టుకొని 11.500 మెగావాట్లకు పెంచడానికి సన్నద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. అన్ని రంగాలకు విద్యుత్ సరఫరా పంపిణీ చేస్తున్నందున బంగారు తెలంగాణకు అడుగులు వేస్తోందని ఆయన గుర్తు చేశారు. దేశంలో విద్యుత్ వినియోగదారుడు సగటున 1122 యూనిట్లు ఖర్చు చేస్తుంటే అదే తెలంగాణలో 1507 యూనిట్లు ఖర్చు చేస్తున్నారని, దీన్ని బట్టి తెలంగాణ విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పడానికి నిదర్శనం అన్నారు. 2019 చివరి నాటికి సొంతంగా తెలంగాణ విద్యుత్‌లో అధనంగా ఉత్తత్తిని సాధిస్తామని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణలో సౌర విద్యుత్ 3401 మెగావాట్లు సాధించి దేశంలో ప్రథమ స్థానం దక్కించుకుందని ఆయన చెప్పారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద రివర్స్‌బుల్ పద్దతిలో విద్యుత్ ఉత్పత్తిని చేపాట్టమన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో దేశంలో రేటింగ్ పడిపోలేదని, కేవలం విమర్శలు మాత్రమే అన్నారు. రాబోవు రోజల్లో విద్యుత్ ఉత్తత్తి, పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేయడానకి రూ. 17558 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యుత్ పంపిణీ సామర్థాన్ని 25682 మెగావాట్లకు పెంచామన్నారు. విద్యుత్ పంపణీ అంతరాయం లేకుండా ఉండడానికి తెలంగాణలో భారీగా సబ్‌స్టేషన్లను నిర్మించడానికి ఎంత ఖర్చు అయినా వెచ్చిండానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ చెల్లింపులు జరగలేదని దీంతో విద్యుత్ రేటింగ్ తగ్గడానికి ఒక కారణమని చెప్పారు. విద్యుత్ శాఖలో అనుభవం ఉన్న సీనియర్ల సలహాలు పాటించడంతో విద్యుత్ లోటును అధికమించామన్నారు. విద్యుత్ కొరత లేనందున యువత పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారని దీంతో 3500 పరిశ్రమలకు 1500 పరిశ్రమలకు తెలంగాణ అనుమతులు ఇచ్చిందన్నారు. తెలంగాణలో భారీ ఎత్తున సాగసనీటి ఎత్తిపోతల పథకాలను చేపట్టినందున అందుకు ఎంత విద్యుత్ అవసరమో అంత విద్యుత్‌ను సరఫరా చేయడానికి ప్రభుత్వ వద్ద లెక్కలు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. ఆగస్టు నుంచి పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నందన విద్యుత్ వసూళ్ళు పెరగవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ల త్వరలో పూర్తి అవుతున్నందన రాబోవు రోజుల్లో విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ పైచేయి అవుతుందన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో సాధించిన ఘనతపై సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి అభినంధించారు. మంగళవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమ శాఖ సాధించిన ప్రగతిపై ముఖ్యమంత్రికి వివరించారు.