తెలంగాణ

కోర్టుకు హాజరైన స్వామిగౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), ఆగస్టు 1: శాసనమండలికి 2011 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ పట్ట్భద్రుల నియోజకవర్గ స్థానానికి పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి స్వామిగౌడ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదైంది. కలెక్టర్ కాంపౌండ్ గోడతో పాటు పోలీస్ వాహనానికి గల క్యాబిన్‌కు వాల్‌పోస్టర్లు అంటించడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అధికారులు ఫిర్యా దు చేశారు. ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానానికి పోటీచేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంట ల ముందు ఫోన్‌లలో మెసేజ్‌లు బంద్ చేయాలని అమలులో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించడంతో ఆయనపై కేసు నమోదైంది. ఆయా రెండు కేసులలో అప్పటి కరీంనగర్ కలెక్టర్ స్మితా సబర్వాల్, తదితరులు ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు. ఆయా కేసుకు సంబంధించి కరీంనగర్ పీసీఆర్ కోర్టులో బుధవారం సాక్ష్యం ఇవ్వాల్సి ఉండడంతో స్మితా సబర్వాల్ హాజరై సాక్ష్యాన్నిచ్చారు. కరీంనగర్‌లో కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆమెపై ఉన్న గౌరవం పట్ల చాలామంది కోర్టుకు వచ్చి పలుకరించారు. అనంతరం ఈ కేసును న్యాయమూర్తి ఎం.రాజు ఈ నెల 21కి వాయిదా వేశారు.
స్వామి గౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి ల తరపున న్యాయవాదులు గోపు మదుసూధన్ రెడ్డి, బూడిద మల్లేశం, విక్రం కుమార్, కోలకాని భూమయ్య వాదించారు.