తెలంగాణ

ములుగులో మొక్కలు నాటిన సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, ఆగస్టు 1: నాలుగో విడత హరితహారం కార్యక్ర మాన్ని సిద్దిపేట జిల్లా ములుగులో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మొక్కలు నాటి ప్రారంభించారు. ఇందులో భాగం గా ప్రతి ఇంట్లో పండ్లు, పూల మొక్కలు నాటాలన్న ముఖ్యమంత్రి ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మండల కేంద్రమైన ములుగులోని ఇరుపాక ఇంద్రారెడ్డి, భాగ్యమ్మల ఇంటి ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కొబ్బరి మొక్కను నాటగా అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆ మొక్కకు నీరు పోశారు. అలాగే, ఇంట్లో నివాసముంటున్న మహిళలకు సపోటా, మామిడి, తురాయి, వేప, నిమ్మ, దానిమ్మ, జామ, కరివేపాకు, గులాబి, మల్లె మొక్కలను నాటించారు. ప్రతి ఒక్కరు ఒక్కో మొక్కను నాటాలన్న సిద్దాంతాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సబాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ముప్పిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, హరితహారం సీఎంఓ ప్రియాంకవర్గీస్, కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, గడా హన్మంతరావు, ఏఎంసీ చైర్మెన్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.