తెలంగాణ

తెలుగును అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు భాషా బోధనను తప్పనిసరి అమలుచేస్తూ ఇటీవల జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చేసిన చట్టం 10/2018ను ఏప్రిల్ 2వ తేదీ నుండే అమలులోకి తెస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో పదో తరగతి వరకూ తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఇటీవలె ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింతది. 2018-19 విద్యాసంవత్స రం నుండి తెలుగు బోధనను తప్పనిసరి చేయాలని నిర్ణయించిన ప్రభు త్వం ఈ మేరకు చట్టం అమలు తేదీని ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో 12 జారీ చేశారు.

ఐదు నెలలుగా జీతాల్లేవ్!
హైదరాబాద్, మే 1: అవును.. తెలంగాణ ఆర్థికంగా మిగులు రాష్టమ్రే అని ఢంకా భజాయించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెబుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు ఆపేసి ప్రభుత్వానికి చేటు తెస్తున్నారు. గత ఐదు నెలలుగా జీతా లు చెల్లించకపోగా, వేసవి కాలంలో సర్వీసులను పక్కన పెట్టడంతో కాంట్రాక్టు లెక్చరర్ల జీవనం దాయనీయంగా మారింది. పోస్టు గ్రాడ్యూయేషన్ చదవులతో పాటు అనేక మంది ఎంఫిల్, పీహెచ్‌డీ చేసిన వారు గత దశాబ్ద కాలంగా జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్నారు.
ఉద్యమాలు చేసిన ప్రతిసారి వారి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రులు చెబుతూ వచ్చినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇదిగో రెగ్యులరైజేషన్ అదిగో రెగ్యులరైజేషన్ అంటూ ఏళ్లు గడిపేసిన అధికార బృందం తెలంగాణ ఆవిర్భావం తర్వాత వారి జీతాలు పెం చారు. ఏదో చన్నీళ్లకు వేన్నీళ్లు అన్నట్టు వేతనాలు పెరిగాయనే సంబడం ఎంతోకాలం లేకుండానే అదే నెల నుంచి చెల్లింపులు నిలిపేశారు. కొంతకాలం ట్రెజరీ చెల్లింపులపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందని చెబుతూ వచ్చిన అధికారులు త ర్వాత నిధుల లేమీతో చెల్లింపులు చేయడం లేద ని చెబుతున్నారు.