తెలంగాణ

ఏసీబీ వలలో పంచాయతీ చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఆగస్టు 1: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు అకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈవోఆర్టీతో పాటు చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీ ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్న జి.నర్సిరెడ్డి ఇంటి అనుమతి కోసం యువకుడి నుంచి రూ.70వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారు లు పట్టుకున్నారు. అతన్ని విచారించి రూ. 70 వేలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని అతని నివాసంపై మరో బృందం దాడి నిర్వహించింది. గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ బి.శ్రీకృష్ణగౌడ్ తెలిపారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్, ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం...చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీని ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చింది. చివరి సమయంలో గ్రామపంచాయతీ ఈవో అంజన్‌రెడ్డి అనివార్య కారణాలతో సెలవులోకి వెళ్లాడు. అతని స్థానంలోకి భువనగిరికి చెందిన అధికారిని ఇన్‌చార్జిగా వేసారు. వెంటనే ప్రజాప్రతినిధులతో ఫైరవీలు చేసి ఈవోపీఆర్డీ నర్సిరెడ్డి ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. చివరి వారంలో ఇళ్ల అనుమతుల కోసం జాతర సాగింది. మున్సిపాలిటీ అయితే అనుమతులకు అనేక అడ్డంకులు ఎదురవుతాయన్న భయంతో ప్రజలు ఇంటి నిర్మాణాల అనుమతుల కోసం ఎగబడ్డారు. ఇదే అదునుగా భావించి పెద్ద మొత్తంలో దండుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకున్న నర్సిరెడ్డి ఏసీబీకి చిక్కారు. చౌటుప్పల్‌కు చెందిన దాచపల్లి మాధవ్ 358 సర్వే నెంబర్‌లో రెండు ఇళ్ల నిర్మాణాల కోసం అనుమతి కోరుతూ రెండేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకున్నాడు. అనేక కొర్రీలు పెడుతూ ఇవ్వకుండా జాప్యం చేసారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అనుమతి ఇప్పించాలని దరఖాస్తులు పెట్టుకున్నాడు. ఈవోపీఆర్డీకి సైతం ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐదు లక్షల రూపాయలు లంచం అడిగి ఎట్టకేలకు లక్షకు బేరం కుదుర్చుకొని దిగొచ్చాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకురావడంతో మరోమారు బేరమాడి రమ్మన్నారు. బేరసారాలు ఆడి 70 వేల రూపాయలకు ఒప్పించుకున్నాడు. ఏసీబీ అధికారులను సంప్రదించి విషయం చెప్పడంతో మండల పరిషత్ కార్యాలయం వద్ద మాటు వేసి నిఘా పెట్టారు. దాచపల్లి మాధవ్ అనారోగ్యంతో ఉండటంతో అతని కుమారుడు దాచపల్లి చంద్రబాబు మండల పరిషత్ కార్యాలయంలో తన చాంబర్‌లో ఉన్న ఈవోపీఆర్డీ నర్సిరెడ్డికి డబ్బులు ఇచ్చి ఇంటి నిర్మాణ అనుమతిపై సంతకం చేసి తీసుకోగానే ఏసీబీ అధికారుల బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని విచారించారు. అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ శ్రీకృష్ణ తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. హైదరాబాద్, హబ్సిగూడలోని కాకతీయ అపార్టమెంటులోని అతని నివాసంపై ఏసీబీ అధికారుల బృందం దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌తో పాటు ఇన్‌స్పెక్టర్లు రఘుబాబు, వెంకట్రావ్, స్వామిలు ఉన్నారు.