తెలంగాణ

అటకెక్కిన ఫెడరల్ ఫ్రంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావడానికి జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు రెండు నెలల కిందటి వరకు హడావుడి చేసిన టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రస్తుతం ఆ ఊసే ఎత్తకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును గోప్యంగా ఉంచుతున్నారా? లేక వచ్చే ఎన్నికలపై దృష్టి సారించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కిందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌తో బుధవారం మీడియా ప్రతినిధులు ప్రస్తావించిగా ఫ్రంట్ ఏర్పాటును పక్కన పెట్టారని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలో లేకపోవడంతో ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టు కాదని కేటీఆర్ చెప్పారు. ఇలావుంటే, ప్రాంతీయ పార్టీల నుంచి ఫెడరల్ ఫ్రంట్‌కు ఉహించిన విధంగా మద్దతు లభించకపోవడం వల్లనే దానిని పక్కన పెట్టి రాష్ట్ర రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించి ఉంటారని రాజకీయ వర్గాల అంచనా. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం లోలోన మొకాలడ్డటం వల్లనే కేసీఆర్ వెనక్కి తగ్గి ఉంటారనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పదవీ స్వీకారోత్సవానికి జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ హాజరైన విషయం తెలిసిందే. ఆ వేదికను కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో కలిసి కేసీఆర్ పంచుకోలేకపోయారు. ఇదే అవకాశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకొని జాతీయ స్థాయిలో ఫ్రంట్‌కు నాయకత్వం వహించేది తానేన్న సంకేతాలను ఇచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కడుదామని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఏం కేజ్రివాల్ ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలంగా స్పం దించడం, అప్పటికే కేంద్రంలో ఏన్డీయేకు టీడీపీ దూరం అయిన విషయం తెలిసిందే. ఏన్డీయే ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్‌ఏస్ మద్దతు ఇవ్వకపోవడం, పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన సంకేతాన్ని ఇచ్చారు. దీంతో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడే ఫ్రంట్‌తో జత కట్టే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. ప్రధాని తో సీఏం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ కావడం, ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కూడా ప్రధానిని కలువడంతో వంటి ఘటనలు మోదీతో కేసీఆర్‌కు అంతర్గతంగా సఖ్యతగానే ఉన్నాయన్న సంకేతాల్ని ఇచ్చింది. అలాగే అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏపీ సీఏం చంద్రబాబును తప్పుబట్టిన ప్రధాని మోదీ, కేసీఆర్‌కు పరిణితి చెందిన నాయకుడిగా కితాబు ఇచ్చారు. ఒకవైపు ఫెడరల్ ఫ్రంట్ ఊసేత్తకపోవడం, మరోవైపు ప్రధాని మోదీతో సఖ్యత పెరగడంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆటకెక్కినట్టేనని రాజకీయ వర్గాలు అంచన వేస్తున్నాయి.