తెలంగాణ

హరిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 1: హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో జిల్లా ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం నాలుగో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు చెరువు గట్లపై ఈత మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. గత మూడు విడతలుగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని ప్రస్తుతం నాలుగవ విడత విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఐదువేల మొక్కలకు తగ్గకుండా ఈ విడతలో నాటాలని తెలిపారు ముఖ్యంగా అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతామని తెలిపారు. స్వచ్ఛ గ్రామాలుగా మారితేనే బంగారు, హరిత తెలంగాణ కల సాకారం అవుతుందని అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరు మరిచిపోరాదని తెలిపారు. కుల వృత్తులను రక్షించి నాణ్యమైన కల్లును అందించడానికి హరితహారంలో భాగంగానే ప్రతి చెరువు గట్టుపై ఈత మొక్కలను నాటడం జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, ప్రతి గ్రామం సమాంతరంగా అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అందులో భాగంగా నూతనంగా రాష్ట్రంలో 4383 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని గురువారం నుండే నూతన పంచాయతీలు ఉనికిలోకి రానున్నాయని వెల్లడించారు. తాను ఆ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు వేలాది గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయడం తాను ఎంతో సంతోషిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అయా గ్రామాల ప్రజలందరు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగారాం, సీఐ ఏడుకొండలు, ఎస్సై సైదాభేగం, అటవీశాఖ రేంజ్ అధికారి వీరేందర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.