తెలంగాణ

ప్రజలకు ఇచ్చిన హామీ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: లంబాడి తండాలను, గిరిజన గూడెంలను, కొద్ది జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా మారుస్తామంటూ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేశామని రాష్ట్ర పంచాయతీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు సందర్భంగా బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన జారీ చేశారు. కొత్త పంచాయతీల ఏర్పాటుతో స్థానిక సంస్థల పాలన కొత్తపుంతలు తొక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు 2 న 4383 నూతన పంచాయతీలు ఉనికిలోకి వస్తుండటం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. శివారు గ్రామాలు, తండాలు, గిరిజన గూడెంలు కొత్త పంచాయతీలుగా మారడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రణాళికలో కొత్త పంచాయతీల అంశాన్ని చేర్చామని, అన్నికోణాల్లో ఆలోచించి, ఇటీవలే తుది నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కొత్త పంచాయతీల ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు చేశామన్నారు. కొత్త పంచాయతీల్లో ఉన్న ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు.