తెలంగాణ

అసెంబ్లీని సందర్శించిన ట్రైయినీ ఐఏఎస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్రానికి తాజాగా నియమితులైన (2017 బ్యాచ్ ఐఎఎస్) 11 మంది అసిస్టెంట్ కలెక్టర్లు బుధవారం శాసనసభ, శాసనమండలిని సందర్శించారు. శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. వారికి శాసనసభ, శాసనమండలిని చూపించిన తర్వాత కొంత సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యదర్శి నరసింహాచార్యులు శాసనసభ, శాసనమండలి సమావేశాల గురించి వివరించారు. శాసనసభ, శాసనమండలి ఏర్పాటు, బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం, సమావేశాల్లో ప్రతి రోజూ ప్రశ్నోత్తరాల సమయం, అనంతరం జీరో అవర్, ప్రతిపాదనలు, అత్యవసర ప్రజా ప్రాముఖ్యం గల అంవాలపై స్వల్పకాలిక చర్చ, తీర్మానాలు, ప్రభుత్వ బిల్లుల ప్రతిపాదన, వాటిని ఆమోదించడం, ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లుల ప్రతిపాదన, సభ్యులకు ఇచ్చే సమయం, సభ్యులకు ఉండే విశేషాధికారాలు, కమిటీల పని తీరు గురించి నరసింహాచార్యులు తెలిపారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్-హెచ్‌ఆర్‌డి)లో ట్రెయినీ ఐఎఎస్‌లు శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో భాగంగా హెచ్‌ఆర్‌డి డైరెక్టర్ జనరల్, ఇవో స్పెషల్ సిఎస్ బిపి ఆచార్య ట్రెయినీ ఐఎఎస్‌లను శాసనసభ, శాసనమండలి సందర్శనకు పంపించారు.