తెలంగాణ

బీజేపీకి ధైర్యం చాలకే కోర్టు ద్వారా సవరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 3: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ మనసులో ఉందని, కానీ ధైర్యం చేయలేకనే సుప్రీంకోర్టు సవరణలు చేసేలా చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హయాం లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై పార్లమెంటులో మేధోమదనం జరిగిన తరువాతే ఆ చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు చట్టంలో మార్పులు తేవడానికి ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. పార్లమెంటు చేయాల్సిన చట్ట సవరణలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం కూడా వారి వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల రక్షణకు తెచ్చిన చట్టాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేసినట్లు తేటతెల్లమైందని అన్నారు. ఈ విషయంలో ఇప్పటికీ ప్రధాని మోదీ నోరుమెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రధాని మోదీ అసమర్ధత వల్లనే ఇలా జరిగిందని, మేము అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని తెలిపారు. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం రివ్యూకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఏమైనా మార్పులు చేయాలంటే పార్లమెంటు ద్వారానే చేయాలని డిమాండ్ చేశారు.