తెలంగాణ

నియంతృత్వ పోకడలపై చర్చ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలపై దేశవ్యాప్త చర్చ జరగాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను అనుభవించలేని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పాలనలో 1975లో ఎమర్జెన్సీ విధించారని, ఆ నాటి పాపం ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు నిరంకుశ, నియంతృత్వంతో పాలన సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. మీడియా కథనాలను పరిశీలిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వార్తలను సైతం ప్రచురించకూడదని మీడియాను నియంత్రించడం దురదుష్టకరమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అదే హక్కులతో ధర్నాలు చేసిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ వాటిని కాపాడాలని డిమాండ్ చేశారు.

వేతనాల అమలుకు అర్చకుల ఆందోళన
*ఆలయాల్లో నిలిచిపోయిన ఆర్జిత సేవలు
హైదరాబాద్, ఆగస్టు 13: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ట్రెజరీ నుండి వేతనాలు ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. సోమవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిచిపోయాయి. మూడు రోజుల నుండి తాము ఆందోళన చేస్తున్నామని తెలంగాణ అర్చకుల సంఘం అధ్యక్షుడు గంగుభానుమూర్తి తెలిపారు. సోమవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వం సానుభూతితో తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.