తెలంగాణ
పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సబర్వాల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపిఎస్ అధికారి అకున్ సబర్వాల్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయమే పౌరసరఫరాల శాఖ కార్యాయానికి వచ్చిన సబర్వాల్‌కు ఈ శాఖ సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పౌరసరఫరాల శాఖ, పౌరసఫరాల సంస్థ, లీగల్ మెట్రాలజీ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ శాఖలో చేపట్టిన ఐటి ప్రాజెక్టుల అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి రేషన్ బియ్యం రవాణా చేసే వాహనాల కదలికలను, గోదాముల్లో సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ-పాస్ యంత్రాల పనితీరు, టి-రేషన్ యాప్, రేషన్ పోర్టబిలిటీ తదితర అంశాల గురించి సంబంధిత అధికారులు కొత్త కమిషనర్‌కు వివరించారు. పౌరసరఫరాల భవన్లో అన్ని విభాగాలను ఆయన సందర్శించారు.