తెలంగాణ

సీపీఎస్‌కు వ్యతిరేకంగా నేడు ‘బ్లాక్ డే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న ‘బ్లాక్ డే’ పాటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం పిలుపునిచ్చింది. విధిగా ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించినట్టు టీజీఎ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని బ్లాక్ డేను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.
కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి తీసుకరావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి మమత ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసారు. కొత్త జోనల్ వ్యవస్థ నిరుద్యోగ యువతకు వరంగా మమత కొనియాడారు.

ప్రధాన అంశాలపై కార్మికులతో సింగరేణి యాజమాన్యం ఒప్పందాలు
* సీఎండీ శ్రీ్ధర్ వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 31: సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన మూడు ప్రధాన అంశాలపై యాజమాన్యం అగ్రిమెంట్లు చేసుకుంది. ముఖ్యంగా 900 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా గుర్తింపు ఇస్తు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కొత్త కేడర్ స్కీమ్ అమలుతో పాటు 11 రకాల అలవెన్స్‌ల శాతం భారీగా పెంచినట్లు సంస్థ సిఎండి శ్రీ్ధర్ తెలిపారు. మరో 90 రోజుల్లో అన్ని సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తనని చెప్పారు. యూనియన్ల సూచించిన డిమాండ్లను పరిష్కరించి సంస్థ బలోపేతం చేయడానకి సమష్టిగా ఉద్యోగులు పని చేయాలని ఆయన హితవు పలికారు.