తెలంగాణ

35 స్కూళ్లకు స్వచ్ఛ విథ్యాలయ పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: స్వచ్ఛత పాటించిన 35 విద్యాలయాలను గుర్తించిన ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన రవీంద్రభారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేయనుంది. పాఠశాలల్లో పరిశుభ్రతను ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం స్వచ్ఛ భారత్‌లో భాగంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయాల పురస్కారాలను ఇస్తున్నారు. పాఠశాలల్లో రక్షిత తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేసినట్టు అధికారులు తెలపారు. రాష్ట్రంలో 26,727 పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో 48 స్కూళ్లు, జిల్లా స్థాయి స్వచ్ఛ విద్యాలయాలుగా నామినేట్ అయితే వాటి నుండి జిల్లాకు 8 ప్రతిపాదనలను ఎంపిక చేసి రాష్టస్థ్రాయి కమిటీ మూల్యాంకనానికి పంపించారు. తుదకు 35 పాఠశాలలను ఎంపిక చేశారు.

9న భాషాదినోత్సవం
తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఈ నెల 9వ తేదీన తెలుగు అకాడమి ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షుడు గంటా జలంధర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించిందని, ఈ సందర్భంగా తెలంగాణ భాష- సమగ్ర పరిశీలన అనే అంశంపై రాష్టస్థ్రాయి భాషా సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సదస్సులో 25 మంది భాషావేత్తలు పాల్గొంటారని, తమ పరిశోధనా పత్రాలను సమర్పిస్తారని అన్నారు. సదస్సు ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 5 వరకూ జరుగుతుందని చెప్పారు.