తెలంగాణ

హౌసర్జన్లకు పెరిగిన స్టయిఫండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: హౌసర్జన్లకు స్టయిఫండ్‌ను పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎ. శాంతకుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంటర్నీస్ (హౌజ్‌సర్జన్లు), పోస్ట్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ, డిప్లొమా), సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు (మెడికల్, డెంటల్) ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. హౌస్ సర్జన్లకు (మెడికల్, డెంటల్) ప్రస్తుతం ఇస్తున్న 12,167 రూపాయలను 19,589 రూపాయలకు పెంచారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, ఎండీఎస్ విద్యార్థులకు మొదటి సంవత్సరానికి 27,376 రూపాయల నుండి 44,075 రూపాయలకు పెరిగాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 28,897 రూపాయల నుండి 46,534 రూపాయలకు పెరిగింది. తృతీయ సంవత్సరం విద్యార్థులకు 30,418 రూపాయల నుండి 48,973 రూపాయలకు పెరిగింది. పీజీ డిప్లొమా విద్యార్థులకు 27,376 రూపాయల నుండి 44,075 రూపాయలకు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 33,459 రూపాయల నుండి 53,869 రూపాయలకు పెరిగింది.