తెలంగాణ

రెండోరోజూ ఎంసెట్‌లో సాంకేతిక అవరోధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: రెండో రోజూ గురువారం నాడు ఎమ్సెట్ అగ్రికల్చర్ స్ట్రీం ఆన్‌లైన్ పరీక్షకు సాంకేతిక అవరోధాలు తప్పలేదు. కొన్ని కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా మొదలైనట్టు సమాచారం. అయితే సకాలంలో ఏర్పాట్లు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో తొలిసారి అన్ని ప్రవేశపరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించడం, అందుకు తగ్గట్టు భారీ ఏర్పాట్లు చేసినా, ఎమ్సెట్ నిర్వహణలో అభ్యర్ధులు ఎక్కువగా ఉండటం, పరీక్ష పత్రాల లీక్ కాకుండా కట్టడి చేయడం వంటి అనేక ఇతర ఏర్పాట్లపై కూడా దృష్టిసారించాల్సి రావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈసారి అగ్రికల్చర్ స్ట్రీంకు 73,078 మంది దరఖాస్తుచేశారు. కనీసం 90 వేల నుండి లక్ష మంది దరఖాస్తు చేస్తే వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష నిర్వహించేందుకు రెండు రోజులు నాలుగు సెషన్లను ఎమ్సెట్ తొలుత ప్రతిపాదించింది. అయితే దరఖాస్తులు ఊహించిన దానికంటే తక్కువే రావడంతో వీరందరినీ మూడు సెషన్లలో సర్దుబాటు చేశారు. తొలి రోజు బుధవారం నాడు ఉదయం పూట 23,809 మందిని, మధ్యాహ్నం 24,743 మందిని వివిధ కేంద్రాల్లో సర్దుబాటు చేశారు. దాంతో ఇక మిగిలిన 24,527 మందిని గురువారం ఉదయం సర్దుబాటు చేయడంతో నాలుగో పూట మరో సెషన్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. రెండో రోజు పరీక్షకు 22412 మంది మాత్రమే అంటే 91.38 శాతం హాజరయ్యారని కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య తెలిపారు.
ఈ నెల 4,5,7 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్షలు ఉదయం సాయంత్రం జరుగుతాయి. ఉదయం పూట 10 నుండి ఒంటి గంట వరకూ, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. అభ్యర్ధులు రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అగ్రికల్చర్ స్ట్రీంలో తొలి రోజు 23,808 మంది ఉదయం సెషన్‌కు నమోదు చేసుకోగా, వారిలో 21,774 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకూ జరిగిన రెండో సెషన్‌లో 24,743 మందికి కేటాయంచగా, అందులో 22,671 మంది హాజరయ్యారు. అంటే ఉదయం సెషన్‌కు 91.46 శాతం, సాయంత్రం సెషన్‌కు 91.63 శాతం మంది హాజరయ్యారు. గురువారం ఉదయం జరిగిన అగ్రికల్చర్ స్ట్రీంకు ఉదయం 24,527 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 22412 మంది హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, జెఎన్‌టియుహెచ్ వీసీ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య, కో కన్వీనర్ ప్రొఫెసర్ ఎం ముంజూర్ హుస్సేన్, మరో కో కన్వీనర్ ప్రొఫెసర్ జీవీ నర్సింహారెడ్డి పరీక్షా కేంద్రాలను, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. గురువారం నాటి ఆన్‌లైన్ పరీక్షకు ఆదిలాబాద్‌లో 50 మంది, హైదరాబాద్‌లో 14154 మంది, కరీంనగర్‌లో 1650 మంది, ఖమ్మంలో 1363 మంది, కోదాడలో 288 మంది, మహబూబ్‌నగర్‌లో 537 మంది హాజరయ్యారు. నల్గొండలో 272 మంది, నిజామాబాద్‌లో 263 మంది, వరంగల్‌లో 243 మంది, సిద్దిపేటలో 81 మంది, కర్నూలులో 399 మంది, తిరుపతిలో 683 మంది, విశాఖలో 477 మంది, విజయవాడలో 1958 మంది హాజరయ్యారు.