తెలంగాణ

వివిధ గమ్యస్థ్ధానాలకు 46 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: వేసవిలో నెలకొన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ గమ్యస్ధానాలకు 46 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. కాకినాడ టౌన్-తిరుపతి-కాకినాడ టౌన్ మధ్య 30 సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించింది.
మే 11, 13, 18, 20, 25, 27, జూన్ 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మే 12, 14, 19, 21, 26, 28, జూన్ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీల్లో బయలుదేరుతుందని ద.మ.రైల్వే స్పష్టం చేసింది. నరసాపూర్-హైదరాబాద్ మధ్య మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో నరసాపూర్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని పేర్కొంది. హైదరాబాద్-విజయవాడ మధ్య 8 ప్రత్యేక సర్వీసులను మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో నడుపుతున్నట్లు తెలిపింది.

అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు
* 24 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్
హైదరాబాద్, మే 4: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నగర టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పౌరసరఫరాల శాఖ సర్కిల్ 9 అధికారులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఒక మినీ అశోకా లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ తేలిక పాటి వాహనం (లైట్ వెహికల్) నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తద్వారా వచ్చే ఆదాయం జీవించేందుకు సరిపోకపోవడంతో అదనపుసంపాదన కోసం రేషన్ బియ్యం తక్కువకు కొని ఎక్కువకు అమ్ముకోవడం ద్వారా లబ్ధిపొందాలని అనుకున్నాడు. ఇందుకు ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న పేదల నుంచి రేషన్ బియ్యం కిలో రూ.8కి కొనుగోలు చేసి, జహీరాబాద్ మార్కెట్‌లో రూ.12 చొప్పున విక్రయిస్తున్నాడు. ఈ రకంగా గత ఆరు నెలల నుంచి అక్రమంగా ఆర్జిస్తున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ నిఘా ఉంచి నిందితుడిని పట్టుకుంది. స్వాధీనం చేసుకున్న బియ్యం, వాహనాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ దాడి నిర్వహించారు.