తెలంగాణ

వ్యవసాయ కమిషన్ అవసరం: కోదండరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ తరహాలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పీసీసీకి అనుబంధ విభాగమైన కిసాన్, ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవన్‌లో కోదండ రెడ్డి అధ్యక్షతన కిసాన్ కాంగ్రెస్ సమావేవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆర్మూర్ రైతు సభలో డిక్లరేషన్ చేసిన అంశాలలో ప్రధానంగా రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఏకకాలంలో చేస్తామని, 17 రకాల వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతు బీమా కింద ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన తెలిపారు.
మైనారిటీల రిజర్వేషన్లు ఏమయ్యాయి?: దాసోజు
పీసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మైనారిటీలకు కల్పిస్తామన్న 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. పీఆర్సీ, ఐఆర్‌లు ప్రకటిస్తానని చెప్పి మోసగించిన ఉద్యోగులను అడిగితే కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలో చెబుతారని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు వైరల్ ఫీవర్ వచ్చినందున కొండ గట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించలేదని పార్టీ నాయకులు చెప్పారని, అటువంటప్పుడు గవర్నర్‌ను ఎలా కలిసారని డాక్టర్ శ్రవణ్ దాసోజు ప్రశ్నించారు.