తెలంగాణ

అంకితభావంతో పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: బీజేపీ విజయానికి అహోరాత్రులు అంకితభావంతో కార్యకర్తలు పనిచేయాలని, దానికి అనుగుణంగా నాయకత్వం సమన్వయంతో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మార్గదర్శనం చేశారు. ఒక రోజు పర్యటనకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలను పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, సీనియర్ నేతలు జీ కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆయనకు వివరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు పి మురళీధరరావు రాష్ట్రంలో బీజేపీ కార్యక్రమాలను ఆయన చెప్పారు. చివరిసారి నల్గొండలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా చేసిన సూచనలను అనంతరం రాష్ట్ర పార్టీ నాయకత్వం అమలుచేసిందని వారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పలు సందర్భాల్లో కీలక అంశాలపై నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు నిర్వహించినట్టు వారు చెప్పారు.
ప్రధానంగా మద్యం అమ్మకాలు, మహిళలపై అత్యాచారాలు, రైతులపై దాడులు, స్కూలు ఫీజులపైనా, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేయకపోవడం, నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతితో పాటు నిర్వహించిన పలు కార్యక్రమాలను వారు జాతీయ అధ్యక్షుడికి వివరించారు. బూత్ స్థాయిలో పటిష్టంగా కమిటీలను నియమించడంతో పాటు శక్తిసంఘాలు సమర్ధంగా పనిచేస్తున్నాయని, జిల్లాలకు ఇన్‌ఛార్జిలను, నియోజకవర్గాల వారీ ఇన్‌ఛార్జిలను నియమించామని, ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలను ఒక పద్ధతి ప్రకారం క్రమబద్ధంగా నిర్వహిస్తూ వచ్చామని వారు చెప్పారు.
ప్రతి కార్యకర్త 15 మందిని ప్రభావితం చేస్తే చాలని, ఎన్నికల ఫలితాలు తారుమారు చేయవచ్చని, ప్రస్తుతం చేసే కృషి రానున్న కాలంలో పార్లమెంటు ఎన్నికలకూ ఉపయోగపడుతుందని, గ్రామస్థాయిలో పటిష్టమైన నెట్‌వర్కు ఏర్పాటు చేసుకోవడానికి దోహదం చేస్తుందని ఈ సందర్భంగా పార్టీ నేతలకు షా చెప్పినట్టు తెలిసింది. గత నాలుగేళ్లలో కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు 2.30 లక్షల కోట్లు అందజేసింది, ఏ పథకం కింద ఎంత మొత్తాన్ని అందజేసిందీ ప్రజలకు వివరించండి, దాంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహకరించడం లేదనే వాదనకు తెరపడుతుంది అని షా సూచించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంతో వాదనకు దిగవద్దని, వాస్తవస్థితిని ప్రజలకు వివరించాలని, మనం ఏం చేశామో చెప్పండి, వారు ఏం చేయలేదో వివరించండి , ఫలితాలను ప్రజలే నిర్ణయిస్తారు అని షా పేర్కొన్నారు.అదే విధంగా ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమం నిర్వహించాలని, బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి ఎలాంటి అవినీతి లేని పాలనను అందించిన ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానిదేనని, ఆ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అదే విధంగా కేంద్రం ప్రతిపాదించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్యక్రమం శిశువులకు టీకాలు అందించే ఇంద్రధనస్సు సహా పలు ప్రధాన కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.