తెలంగాణ

12.45 లక్షల ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్యాల, ఏప్రిల్ 3: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవ పనుల పూర్తితో రాష్ట్రంలో 12.45లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంసాగర్‌లో నిర్మిస్తున్న పంప్‌హౌస్ పనుల పరోగతిని మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ముంపుతో, తక్కువ సమయంలో ఎక్కువ సాగుకు నీరందించే విధంగా ఎస్సారెస్పీ పునర్జీవ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
కేవలం 48 ఎకరాల ముంపు మాత్రమే జరిగిందని ఒక్క ఏడాదిలోలే ప్రాజెక్టు రూపకల్పన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. జూలై మాసంలోగా పనులు పూర్తి చేసి వరద కాల్వ పారే విధంగా లక్ష్యం మేరకు పని చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న వరద కాల్వను ఒకే రిజర్వాయర్‌గా మార్చుతూ వనరులను ఉపయోగించుకొని 12.45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్టు అన్నారు. వరద కాల్వ, కాకతీయ కాల్వలకు మధ్య ఉన్న సుమారు 85వేల ఎకరాల ప్రజలకు సాగునీరే కాకుండా తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రాజెక్టుతో అన్ని ఇబ్బందులు పరిష్కారవౌతాయన్నారు. 6మీటర్ల ఎత్తున పోటీ పెడితే అది అందరికీ అందేది కాదన్నారు. ఎస్సారెస్పీలో 0-122కిలో మీటర్ల మధ్య లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. మరో 11 వోటీలు కొత్తగా మం జూరు చేసి పనులు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిపారు. కొత్త వోటీలన్నీ 4మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నామని, 112టీ ఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారెస్పీ ప్రాజెక్టు సీల్ట్ మూలంగా 90టీఎంసీలకు తగ్గిందని అన్నా రు. ఈ ప్రాజెక్టు ద్వారా జగిత్యా ల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేస్తుందని, సీసీ కెమెరాలతో సీఎం ప్రతి రోజు పనుల పురోగతిపై పర్యవేక్షణ చేస్తారని నివేదికను పంపించాలని అధికారులను ఆదేశించామన్నారు. తక్కువ ఎత్తుతో ఎక్కువ నీటిని పంపింగ్ చేసి ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ప్రాజెక్టు అన్నారు. ప్రాజెక్టు కోసం 220 కేవీ సబ్ స్టేషన్లు 3, ఎలక్ట్రికల్ టవర్లు 119నిర్మాణం కొరకు విద్యుత్ శాఖను ఆదేశించామని జూలై మొదటి వారంలోగా పనులు పూర్తి చేయాలన్నారు.