తెలంగాణ

తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో ఉన్న కోఠీ మహిళా అటానమస్ కాలేజీకి మహిళా యూనివర్శిటీ హోదా కల్పిస్తూ రా ష్ట్ర ప్రభుత్వం నేడో రేపో ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్టు తెలిసింది. 96 ఏళ్లగా ఉన్న కోఠీ మహిళా కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే గాక, ఆంధ్రాలోనూ ఖ్యాతి గడించింది. 2018-19 విద్యాసంవత్సరం నుండే కోఠీ మహిళా కాలేజీకి యూనివర్శిటీ హోదా కల్పించనుంది. శాసనసభ సమావేశాలు ఇప్పట్లో జరిగే వీలు లేకపోవడంతో బిల్లును రూపొందించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. విద్యాసంవత్సరం వచ్చే నెలలో ప్రారంభం కావల్సి ఉన్న నేపథ్యంలో వెంటనే యూనివర్శిటీ హోదాకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు చూస్తున్నారు. శీతాకాల సమావేశాలు విద్యాసంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జరుగుతాయి కనుక అవసరమైతే ఆర్డినెన్స్ స్థానే అపుడు బిల్లు తీసుకురావచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాన్ పథకం కింద యూనివర్శిటీ హోదా కల్పించేందుకు 50 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫిబ్రవరి నెలలో కోఠీ మహిళా కళాశాలను కలిసి వాస్తవస్థితిని తెలుసుకున్నారు. వివిధ విభాగాల అధికారులతో కమిటీని నియమించి ఒక సమగ్ర నివేదికను తెప్పించుకున్నారు. ఈ నివేదికను ప్రభుత్వానికి, ఉన్నత విద్యాశాఖకు పంపించి తదుపరి కార్యాచరణకు పూనుకున్నారు. కొత్తగా నిర్మించాల్సిన భవనాలు, వ్యయం, సిబ్బంది, బోధనేతర సిబ్బంది అవసరాలు, ఇతర వౌలిక సదుపాయాలు ప్రధానంగా లైబ్రరీ, ల్యాబ్‌లు, బాలికల విశ్రాంతి ఆవరణలు, ఫ్యాకల్టీ కూర్చోవడానికి అవసరమైన సదుపాయాలకు సంబంధించి కూడా నివేదిక రూపొందించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం యూనివర్శిటీ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించింది. అందులో రూ.37 కోట్లు కోఠీ మహిళా కళాశాల అభివృద్ధికే కేటాయించారు.

ఏసీబీ అదనపు ఎస్పీ అశోక్‌కుమార్ సస్పెన్షన్?
హైదరాబాద్, మే 4: అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)లో పని చేస్తున్న అదనపు ఎస్సీ అశోక్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. విధి నిర్వహణలో అలసత్వం వహించడం, చురుగ్గా పనిచేయకపోవడం వంటి కారణాలతో సస్పెండ్ చేసినట్లు సమాచారం. అంతే కాకుండా హెచ్‌ఎండిఏ అధికారి పురుషోత్తమ్ రెడ్డి అవినీతి కేసులో విచారణ సరిగ్గా నిర్వహించలేదని, నిందితుడికి సహకరించారనే ఆరోపణలు కూడా రావడంతో ఏసీబీ డిజి శాఖాపరంగా అదనపు ఎస్పీని సస్పెండ్ చేసినట్లు తెలిసింది.