తెలంగాణ

27న బాపూజీ జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను ఈ నెల 27 న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. బాపూజీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి జోగురామన్న చైర్మన్‌గా 97 మందితో ఒక కమిటీని వేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర రాజధానిలో నిర్వహించే రాష్టస్థ్రాయి ఉత్సవాలకు ఎనిమిది లక్షలు కేటాయించగా, 31 జిల్లాలకు వేర్వేరుగా జిల్లాకు 20 వేల రూపాయల చొప్పున కేటాయించారు. అంటే మొత్తం 14.20 లక్షల రూపాయలను వ్యయం చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ నిధులను నుండి ఈ మొత్తాన్ని వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.