తెలంగాణ

బీ కేటగిరి సీట్లలో నకిలీ అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో బీ కేటగిరి సీట్లలో నకిలీ అభ్యర్ధుల సంఖ్య బాగా పెరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడో ఉండి, ఇక్కడ వివిధ కోర్సుల్లో చేరుతున్న అభ్యర్ధుల పేర్లను ర్యాటిఫికేషన్ పేరుతో ఉన్నత విద్యా మండలిలో అవినీతి జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు సీట్లను భర్తీ చేసుకోవడానికి బీ కేటగిరి అభ్యర్ధులకు అటెండెన్స్ రాయితీలు ఇస్తూ అడ్మిషన్లు చేస్తున్నాయి. అసలు ఫీజుకు రెండు మూడు రెట్లు వసూలుచేసుకుంటూ సీట్లు మిగిలిపోయాయనే అపప్రద లేకుండా వచ్చిన వారికి వచ్చినట్టు అడ్మిషన్లు చేస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు ఒరిస్సా, చత్తీస్‌గడ్, పశ్చిమబెంగాల్‌కు వెళ్లి అక్కడ ప్రచారం చేసి ఆ విద్యార్థులకు అడ్మిషన్లు చేపడుతున్నాయి. కన్వీనర్ కోటాలో విద్యార్థి బయోమెట్రిక్‌ను సైతం సేకరిస్తున్న ప్రభుత్వం బీ కేటగిరి సీట్లకు వచ్చేసరికి మాత్రం విద్యార్థి లేకుండానే సీట్లు కేటాయిస్తున్నాయి. విద్యార్థి సర్ట్ఫికేట్లను తీసుకువచ్చి ఉన్నత విద్యామండలిలో ర్యాటిఫికేషన్ పొందుతున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా ర్యాటిఫికేషన్ అనేది ఒక పెద్ద అవినీతి కార్యక్రమంగా అందరికీ తెలిసినా ఉన్నత విద్యా శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

ఏబీవీపీ వినతి
బీ కేటగిరి సీట్లలో అభ్యర్ధులకు బయోమెట్రిక్ అమలు చేయాలని ఏబీవీపీ నేతలు జెఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఇతర రాష్ట్రాల నుండి విద్యార్థులను రప్పించుకుని యాజమాన్యాలు గోల్‌మాల్ చేస్తున్నాయని ఏబీవీపీ నేతలు ఆరోపించారు.
ఎమ్సెట్‌లో మంచి క్వాలిఫై కాక, మంచి ర్యాంకు రాక, బీ కేటగిరి సీట్లవైపు చూస్తున్నారని , మేనేజిమెంట్ కోటా సీట్లలో చేరి, క్లాసులకు రాక, సరిగా చదవక, క్రెడిట్స్ లేకుండా డిటెయిన్ అవుతున్నారని ఏబీవీపీ పేర్కొంది. దీనిని నివారించాలంటే వ్యక్తిగతంగా అభ్యర్థుల సమక్షంలోనే వారి సర్ట్ఫికేట్లను పరిశీలించాలని ఏబీవీపీ టెక్నికల్ సెల్ కన్వీనర్ చల్లా రామకృష్ణ, కో కన్వీనర్లు పితాని సందీప్, బత్తిని సతీష్, చింతకుంట్ల సాయికుమార్, జవ్వాది దిలీప్ తదితరులు కోరారు.