తెలంగాణ

మీ కేసులకు భయపడేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లపై ఐటీ సోదాలు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఐటీ సోదాలను టీపీసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, వి హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్‌రెడ్డి ఇళ్లపై జరిగిన ఐటీ సోదాలపై గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలు మీడియాతో మాట్లాడారు. సోదాలు చేయాల్సింది రేవంత్‌రెడ్డి ఇళ్లపై కాదని ...ప్రగతి భవన్‌లో సోదాలు నిర్వహిస్తే వందల కోట్లు దొరుకుతాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలో అత్యంత అవినీతికి పాల్పడింది కేసీఆర్ కుటుంబమేనని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి కేసీఆర్ కుటుంబం ఆరు శాతం కమిషన్లు దండుకుందని ధ్వజమెత్తారు. కేంద్ర సంస్థలతో సోదాలు నిర్వహిస్తూ తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ అధికార పార్టీ నేతలు తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణ కూడా కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. మొన్న జగ్గారెడ్డిపై నిన్న గండ్ర రమణారెడ్డిపై, నేడు రేవంత్‌రెడ్డి అఅకమ కేసులు బనాయించారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులతో కేసీఆర్ భయపెడితే ఇక్కడా భయపడేవారు ఎవరూ లేరని, టీఆర్‌ఎస్‌పై ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆయన హెచ్చరించారు.

సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తొత్తుగా మారారు: వీహెచ్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్ నరసింహన్ తొత్తుగా మారారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నట్టుగా లేదని పూర్తిస్థాయి ప్రభుత్వం కొనసాగుతున్నట్టు ఉందని విహెచ్ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డిపై సోదాలు రాజకీయ కక్ష సాధింపేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెబుతామని విహెచ్ హెచ్చరించారు.
కేసీఆర్ పాత కేసులు తిరగడోడుతాం: కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌పై పాత కేసులన్నీ తిరుగడోడి జైలుకు పంపుతామని కాంగ్రెస్ మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతీ ఒక్కరినీ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వానికి కాలం చెల్లిందన్నారు. మొన్న తనపై, నిన్న జగ్గారెడ్డిపై నేడు రేవంత్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని కోమటిరెడ్డి మండిపడ్డారు.

ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: జానారెడ్డి
ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కె జానారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజా హక్కులను కాలరాసే విధంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్ నేతలు లొంగరని జానారెడ్డి హెచ్చరించారు. టీఆర్‌ఎస్ సర్కార్ కక్ష సాధింపులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వ ప్రభుత్వాలను గద్దె దింపాలని ప్రజలకు జానారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పాలనను అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.