తెలంగాణ

ప్రభుత్వ ఆఫీసుల్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: రానున్న రోజుల్లో దశల వారీగా ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ మండలి సీఎండీ రఘమారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ తెలంగాణలో పురపాలక సంఘాలు, మేజర్ పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లను అమర్చడానికి విద్యుత్ శాఖ 30వేల స్మార్ట్ మీటర్లును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. 2019 మార్చినాటికి తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. పురపాలక సంఘాలు, మేజర్ పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త స్మార్ట్ మీటర్లు బిగిస్తే విద్యుత్ ఆదాతో పాటు అక్రమంగా విద్యుత్‌ను వినియోగించడానికి అవకాశం ఉండదన్నారు. ప్రతి నెలా సంబంధిత ప్రభుత్వ కార్యాలయానికి విద్యుత్ వాడకం ఎంత అవసరమో అంతే విద్యుత్‌ను స్మార్ట్ మీటర్లలో రీడింగ్ అవుతుంది. ఎక్కువ విద్యుత్‌ను సరఫరా చేయడానకి స్మార్ట్ మీటరు అనుమతించదు. ప్రస్తుతం ఉన్న పాత విధానంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కోట్లాది రూపాయల బకాయిలు ఉన్నాయన్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పడిపోతోందన్నారు. జాతీయ స్థాయిలో విద్యుత్ వసూళ్లలో తెలంగాణ వెనకబడిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పురపాలక సంఘాలు, మేజర్ పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేస్తుంటారని అందుచేత విద్యుత్ బిల్లు చెల్లించలేక పోవడంతో బకాయిలు పెరిగిపోతున్నాయని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో స్మార్ట్ మీటర్ల విధానంతో ఎప్పటికప్పుడు విద్యుత్ బిల్లు చెల్లించకపోతే తక్షణం సరఫరా ఆగిపోతుందన్నారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని ప్రపంచ దేశాలల్లో ఆదరణ నానాటికి పెరిగిపోతోందన్నారు.