తెలంగాణ

విద్యారంగంలో తెలంగాణకే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలోనే విద్యారంగంలో అనేక మార్పులు చేపట్టామని, అవన్నీ ఇపుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి సింగపూర్ విద్యామంత్రి యా కుంగ్ ఒంగ్‌కు వివరించారు. ప్రపంచ విద్యా సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి వెళ్లిన బృందానికి ప్రొఫెసర్ టి పాపిరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఒ నర్సింహారెడ్డిలు ఉన్నారు. ఉన్నత విద్యారంగంలో సింగపూర్ భాగస్వామ్యంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రొఫెసర్ పాపిరెడ్డి ఆయనకు వివరించారు. పారిశ్రామిక ఔత్సాహికతకు, వినూత్న పరిశోధనలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలనూ, ఉన్నత విద్యా మండలి చేపట్టిన సంస్కరణలను ఈ సందర్భంగా రాష్ట్ర బృందం సింగపూర్ మంత్రి దృష్టికి తెచ్చింది. స్టార్టప్‌లను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా పారిశ్రామిక ఔత్సాహికతను పెంపొందిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ను ఐటీ గ్లోబల్ హబ్‌గా మార్చడంలో ఐటీ మంత్రి కేటీ రామారావు ఎంతో కృషి చేశారని వారు చెప్పారు. ఈ సందర్భంగా వారు సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎంగ్ చే టన్ , మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ సియో వున్ హన్‌ను కలిశారు. ఈ సదస్సు గురువారం నాడూ కొనసాగనుంది.

ఉస్మానియాకు వంద కోట్లు:
ఉస్మానియా యూనివర్శిటీకి రూసా 2.0 కింద వంద కోట్ల రూపాయిలు మంజూరయ్యాయి. దేశవ్యాప్తంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ కేటగిరి -4 కింద పది యూనివర్శిటీలను ఎంపిక చేసింది. అందులో తెలంగాణ నుండి ఉస్మానియా యూనివర్శిటీ ఎంపికైంది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన రూసా సదస్సులో వర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం తదితరులు హాజరై వర్శిటీ అభివృద్ధి ప్రణాళికను వివరించారు. ఈ నిధులతో ఉస్మానియా యూనివర్శిటీ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయడం వీలవుతుందని అన్నారు.